కొడుకు! అచ్యుతుని రాజ్యశ్రీ

 రంగనురం జమీందారు ఒకప్పుడు బాగా బతికిన పెద్ద మనిషి!గోశాలలు గుడిగోపురాలు సత్రం కట్టించాడు. అందరికీ లాభంచేకూర్చినవాడే! ఆయన ముగ్గురు కొడుకులు  చదువు సంధ్యలు పూర్తి చేశారు. పెద్ద కొడుకు లిద్దరూ స్వార్ధ పరులు.తమభార్యాపిల్లలు తమ సుఖసంతోషాలు ముఖ్యం!తండ్రి చేసే దానధర్మాలు వారికి  నచ్చవు."కూచుని తింటే కొండలైనా కరిగిపోతాయి.డబ్బు లేని వాడు డుబ్బు కి కొరగాడు.ఉన్న దంతా ఖర్చు పెడ్తే ఎలానాన్నా?"అని తండ్రిని మందలించేవారు.మూడోకొడుకు వినయ్ అనేవాడు"నాన్నా! మీరు సంపాదించిన దంతా మీరే సద్వినియోగం చేయండి. మమ్మల్ని ప్రయోజకుల్ని చేశారు. అంతేచాలు".
భార్య పోయిన దు:ఖంలో ఉన్న  జమీందారు మిత్రుడితో కలిసి తీర్ధయాత్రకి బైలుదేరాడు. పెద్ద కొడుకు లిద్దరూ సంతోషించారు కొన్నాళ్ళు ఐనా ముసలాయన దానధర్మాలు ఆగుతాయని.పెళ్ళి పేరంటంకాని వినయ్ మాత్రం బాధ పడ్డాడు.  జమీందారు తన మిత్రుడు ధనపతికి కొడుకుల స్వభావం చెప్పి తెగ బాధపడ్డాడు. కాశీలో మకాం వేశారు వారు. "చూడు రంగా!నేనొక ఉపాయం ఆలోచించాను.ఈదెబ్బతో నీకొడుకుల బండారం బైట పడ్తుంది."అని "మీనాన్న కి బాగా సుస్తీగా ఉంది. ఆఖరి ఘడియల్లో ఉన్నారు. మేము కాశీలో ఉన్నాం" అని ఫోన్ చేశాడు ధనపతి.పెద్ద కొడుకులు చెప్పిన  జవాబు ఇది"అంకుల్!మాపిల్లల పరీక్షల టైం!ఎలాగూ మీరు కాశీలోనే ఉన్నారు కదా?అంతిమ సంస్కారాలు మీరే చేయండి. మీరు  ఇక్కడికి వచ్చాక ఖర్చు లన్నీ అణాపైసల్తో సహా తీర్చేస్తాం" .వినయుడుమాత్రం అలా ఊరుకోలేదు. వెంటనేబైలుదేరాడు."ముగ్గురు కొడుకులు  ఉండి నాన్న ను అంకుల్ పై వదిలేయటం భావ్యంకాదు"అని కాశీకి వెంటనే బైలుదేరాడు.
కాశీలో తండ్రి  ధనపతి హాయిగా కులాసాగా ఉండటంచూసి ఆశ్చర్య పోయాడు. "మీఅన్నలవ్యవహారం తేల్చేద్దామని మేమిద్దరం నాటకం ఆడుతున్నాం.నీవు ఇక్కడే ఉండి వ్యాపారం చేసుకో! నీకు ఇల్లు కొన్నాం" అని చెప్పటంతో అన్నలకి ఫోన్ చేశాడు "నాన్నని కనిపెట్టుకుని కొన్నాళ్ళు నేను ఇక్కడే ఉంటాను." ఆరునెలలు గడిచాయి.వినయుడి వ్యాపారం మూడు పూలు ఆరు కాయలు గా వర్దిల్లింది. తండ్రి మిత్రుడి కూతుర్ని పెళ్లాడి తండ్రి ని చూసుకుంటున్నాడు.ధనపతి ఎప్పుడో వెళ్లి పోయాడు. పెద్ద కొడుకు లిద్దరూ తండ్రి తమ్ముడి ఊసుమర్చిపోయి తమ్ముడి వాటా ఆస్తి కూడా తమ ఇద్దరి మధ్య పంచేసుకుని జల్సాగా ఉన్నారు. ఏడాది గడిచింది. హఠాత్తుగా వరదలు భూకంపం రావటంతో అన్నల ఇళ్ళు పొలాలు  కుప్పకూలి సర్వనాశనమైనాయి.ప్రాణాలతో బైట పడ్డారు.కానీ జమీందారు పై ఉన్న భక్తి గౌరవాలతో చుట్టుపక్కల ఉన్న  ఆయన మిత్రులు ఈ కొడుకుల కుటుంబాలని ఆదుకున్నారు.కానీ వారిలో అహం చావలేదు.వినయుడి సహాయం తీసుకోవాలి అని కాశీకి వెళ్లారు. తమ్ముడి వైభోగం ఇల్లు  తండ్రిని చూసి ఖంగు తిన్నారు."నాన్నా!మమ్మల్ని క్షమించండి "అని కాళ్ళపై బడ్డారు."మీరు అవకాశ వాదులు.తమ్ముడికి కూడా టోపీ పెట్టే రకాలు. మీతంటాలు మీరు పడండి" అన్న తండ్రి మాటలకు సిగ్గు అవమానం తో తిరుగు ప్రయాణమైనారు.మన మంచితనం మనధర్మం మనల్ని కాపాడుతాయి"అనే మాటల్లో ఎంతో నిజం ఉంది సుమా!🌹
కామెంట్‌లు
M.V. Satyaprasad చెప్పారు…
విలువలు పెంచే విషయం రాశారు. చాలా బాగుంది. తండ్రి చనిపోయాడని తెలిసినా రాకపోవటం దారుణం. కానుగునంగా దానధర్మాలు తగ్గాయి. అతిగా దానం చేసి ఆస్తి పోగొట్టుకోవడం కూడా సరికాదు. విలువలు పెంచే విషయం బాగా నచ్చింది.