మనసును నీవు నియంత్రించు
లేదా మనసు నిన్ను నియంత్రిస్తుంది!!
కానీ
నా ఆలోచనలను
నేను కాదు నా మనసు కాదు
మీరు నియంత్రిస్తున్నారు!!?
అంటే
మీరు మరో బ్రహ్మ లై
నన్ను మర బొమ్మను చేశారు!!?
నా వేషాన్ని నా భాషను
నా అవకాశాలను శాసించారు
నా హక్కులను నా అర్హతలను శాసించారు
పర్వాలేదు కానీ
ఇప్పుడు ఏకంగా
నా ఆలోచనలను నా మనసును
మీరు నియంత్రిస్తున్నారు
మీరు మరో బ్రహ్మ లై
నన్ను మరబొమ్మనుచేశారు!!?
వెండి బంగారం పేరుతో
భయభ్రాంతులను పెంచి
ఆభరణాల కోసం ప్రాణాలు తీశారు
ఆరోగ్యం పేరుతో
ఆహారపు అలవాట్లను మార్చి
వ్యాపారం చేశారు
శృంగారం పేరుతో
కామ కర్మగారాలను పరిచయం చేశారు
పర్వాలేదు
కానీ ఇప్పుడు ఏకంగా
నా ఆలోచనలను నా మనసును నియంత్రిస్తున్నారు
మీరు మరో బ్రహ్మ లై
నన్ను మర బొమ్మను చేశారు!!?
నా మాటలను నా అలవాట్లను
నా ఇష్టాలను నా అదృష్టాలను
నా సంతోషాలను నా కలలను దూరం చేసి
కష్టాలను కన్నీళ్లను కానుకగా ఇచ్చారు
పర్వాలేదు
కానీ ఇప్పుడు ఏకంగా
నా మనసును నా ఆలోచనలను
నియంత్రిస్తున్నారు!!?
మీరు మరో బ్రహ్మ లై
నన్ను మర బొమ్మను చేశారు!!?
Dedicated to my best friend kapilavai Ananda Vardhan
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
Shri Shri kalavedhika president
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి