గొప్పహరి-హరక్షేత్రం సింహగిరి;-.కోరాడ నరసింహా రావు.
శతాబ్దాల క్రితమే వెలసిన.... 
  స్వయంభువు ఆ స్వామి !
   సింహాద్రి అప్పన్నగ... 
..   పూజలందుటేమి  !?

  అచంచల భక్తుడతడు.... 
    అకుంఠిత విశ్వాసమది
       ఆశగా ప్రహ్లాదుడు 
           అడిగినంతనే....., 

 నృసింహుడే ప్రేమమీర 
.. తనపూర్వ అవ తారమౌ 
      వరాహ రూపమును 
        చూపించినాడు !

భక్తుని కోరిక దీర్చగ 
 గిరిపై ఆనాడు వెలసి 
  ఈనాటికినీ స్వామి 
   పూజలందుచున్నాడు !

శివకేశవ అబేధమును 
  ప్రకటించుచు తాను 
    చందనమున కప్పబడి 
      లింగరూపుడైనాడు !

హరియే... హరుడు 
   హరుడే...హరిగా  
      వెలసిన గొప్ప హరి - 
         హర క్షేత్రం సింహ గిరి !
        
 వత్సరమునకొక్కరోజు 
   తన నిజరూపము జూపుచు 
      చందనోత్సవము పేర 
        జనుల నానoద పరచగా!  

కామెంట్‌లు