కార్మికులు - దేశసౌభాగ్యం;--మాడుగుల మురళీధరశర్మ*
 మేడే సందర్భంగా
శుభాకాంక్షలు., శుభాభినందనలతో..,
**********
కం-1
మేడే నేడే కాగా
వాడినకుసుమాలుచూడ*
వసుధాస్థలిపై!
మాడిన మసిబొంతలుగా
తాడూబొంగరములేని*
దౌర్భాగ్యులిలన్!
కం-2
కూడుకు గుడ్డకు వెదికెడు
పీడితతాడితజనాలు*
పెక్కురుగలరే!
నీడకు గాలించుచునే
వేడికి తా తాళలేని*
విహ్వలులేగా!
ఉమా-3
కొండలపిండిచేయుచును*
క్రుమ్మరుచుందురు
తోడునీడకై!
ఎండకువానకున్ సతము*
నేడ్చుచు మ్రగ్గెడుకార్మికాత్మజుల్!
తిండికి గంజియో,కలియొ*
దేహపునాకలితీర్చగోరుచున్!
బండలకొట్టుచున్ చమట*
బారిన చిక్కెడు వారె కార్మికుల్!
ఉమా-4
మేడలు,మిద్దెలున్ గుడులు*
మేలగునట్టిభవంతులన్నియున్!
దౌడునుతీయువేగమున*
దండిగకట్టెడుతాపికార్మికుల్!
మోడగుజీవితమ్ములుగ*
మోదుగవృక్షము ఁబోలురీతిలో!
వాడగవాడిపోవునవ*
భారతదేశమునందునెప్పుడున్!
ఉమా-5
కాడుకుఁగట్టుయెద్దువలె*
ఘర్మజలమ్మునుకార్చుజీవిగా!
బాడుగజీవనమ్ముమసి*
అండగజేర్చరండుకని*
నార్తినిబాపగజాలిజూపుచున్!
బారిన యానిగ సంద్రమీదుచున్!
మొండిగముందుకేగగల*
ముష్ఠిసమిష్టిగ కండపిండుగా!
చం.మా-6
దినదినమార్తికోరుచును*
దీనుడునౌ కలికాల కార్మికుం!
డనయముమేనువంచుచును*
మనసుననార్తిబాపగల*
మాన్యులు మీరలె
నాయకాగ్రజుల్!
నన్యులబానిసగాచరించుచున్!
తనువుకృశింపజేయుచును*
తాపసిగానెగతించునంత్యమున్!
ఉమా-7
శ్రామిక,కార్మకుల్ భరత*
సంపదలెప్పుడు నెంచిచూడగన్!
ధామములేవిలేవుధర*
దైవము,దేవళమంతశూన్యమే!
ఏమని చెప్ప వీలగును*
యెక్కడిచర్చి,మసీదులేలకో!
కామితభోగభాగ్యములు*
గౌరవమంతయువారిమూలమే!
కం-8
శిలలుగనుండినఫలమా?
అలవోకగశిలలతొల్చు*
నాశిల్పియెగా!
ఉలితొలిచెక్కకపోయిన
సులువుగనారూపురాదు*
సుందరశోభన్!
 
కం-9
కర్షక, కార్మిక, శ్రామిక
హర్షముతోడుతజనించు*
నైశ్వర్యమ్ముల్!
వర్షాచలముగ సతతము
వర్షించగ భారతాన*
వర్ధిలు మేడే!
కం-10
వందనముకార్మికులకిల
వందనమోశ్రామికులకు*
వరధనమిదియే!
వందనముకర్షకులకున్
వందనములనందజేతు*
భరతావనిలో!

కామెంట్‌లు