తెలుగు భాష - ప్రాచీన భాష;- బెహరా ఉమామహేశ్వరరావు

 మన తెలుగు భాష విశేషమై ఆంధ్రము, తెనుగు, తెలుగు అను పేర్లతో నేటికి వ్యవహరింప బడు తున్నది. కానీ  మన భాషకు ఈ పేర్లు ఎప్పుడు వచ్చాయన్నది స్పష్టం గా చెప్పలేక పోతున్నాము. కృష్ణా గోదావరి, నదుల మధ్య గల ప్రదేశం. తెలుగుదేశంగా ప్రసిద్ధికెక్కినది. నన్నయ కాలం నాటికే, ఆంధ్రం, తెలుగు అనే పేర్లు మన భాషకు ఉండడం గొప్పదనమే.
    ఆ తరువాత శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం అను మూడు పుణ్యక్షేత్రాల మధ్య ఉన్న ప్రాంతాన్ని త్రిలింగ దేశంగా పిలువబడేది. కాకతీయ రాజుల పరిపాలనా కాలం నాటికి త్రిలింగ దేశంగా పిలువబడేదని తెలుగు సాహిత్య కారులు చెబుతున్నారు.ఈ ప్రాంతానికి తెలంగాణా అని కూడా పేరు వచ్చింది.ఇక్కడ  జనులు మాట్లాడే భాష తెలుగు భాష.
 తెలుగు భాష మాట్లాడే ప్రాంతం కావడం వల్ల తెలంగాణా అని కూడా పిలువబడిందని చెబుతారు.
        నన్నయభట్టు కాలం నాటికే తెనుగు, తెలుగు, ఆంధ్రం అనే పేర్లు ఉండుట విశేషం. ఇది ఆ ప్రదేశ చరిత్ర ననుసరించి గాని భాషా చరిత్రననుసరించి గాని తెలుగు భాష ప్రాచీనమైనదనుట నిర్వి వాదాంశము.
భారతదేశంలో గల ప్రాచీన ఆరు భాషలలో తెలుగు 
ఒకటిగా గుర్తింపబడింది.
       తెలుగు భాషను, తెలుగు జాతిని ఉద్ధరించిన రాజులు, రాజవంశాలు, క్రీస్తు పూర్వమునుండి
ఉన్నట్లు  చరిత్ర చెబుతోంది. తెలుగు జాతి కీర్తిని యినుమడింప  చేసిన రాజవంశాలు అనేకం ఉన్నాయి. వాటిలో
శాతవాహనులు-క్రీ.పూ.200-క్రీస్తు తరువాత 200
కళింగులు  - ‌‌ క్రీ.పూ.180 - క్రీ.శ. 400
ఇక్ష్వాకులు - క్రీ.శ.210 - క్రీ.శ.300
బృహత్పలాయనులు - క్రీ.శ.300 - క్రీ.శ.-350
ఆనంద గోత్రులు  -   క్రీ.శ.295 - క్రీ.శ. 420
విష్ణుకుండినులు - క్రీ.శ.- 375 - క్రీ.శ.555
      ఈ రాజవంశాలతో పాటు తంజావూరు చక్రవర్తులు, విజయ నగర రాజులు, పల్లవులు చాళుక్యులు వంటి గొప్ప చక్రవర్తులు; ఆంధ్ర దేశాన్ని పాలించినట్లు చరిత్ర ద్వారా స్పష్టమవుతుంది.
     మన తెలుగు భాష ప్రాచీనమైనదేనని నిస్సందేహంగా  చెప్పవచ్చును. 10వ శతాబ్దంలో రాజమహేంద్రవరం రాజధానిగా చేసుకొని పరిపాలించిన  రాజరాజనరేంద్రుని ఆస్థాన కవి నన్నయ. ఈయన తెలుగు భాషను సంస్కరించారు జానపదులు సామాన్యుల వాడుక భాషను వ్యవస్తీ
కరించి గ్రంథస్తం చేసేందుకు అనుగుణంగా రూపొం
దించారు. నన్నయ్య సాహితీ కృషి ఫలితంగా
తరువాత కాలంలో  తెలుగు భాష ఎంతో అభివృద్ధికి నోచుకుంది.
             

కామెంట్‌లు