దానం చేసే గుణం సద్గుణం
ఇది మానవ జాతికి దక్కిన సుగుణం
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం
మనుష్యులే కాదు
సర్వజీవులు ఒకటేనని సమభావ, సమానత్వం
ప్రదర్శించటం దాన గుణానికి
ప్రతీక రంజాన్.
ఈ ధర్మాల వల్ల మనిషి
సంపదల్లో లోటు రాదని
దైవ ప్రవక్త మహమ్మద్
ప్రకటించాడు
పవిత్ర గ్రంధం ఖురాన్
జకాత్ విధిగా చెల్లించాలని
ఆజ్ఞాపించింది.
దరిద్రపు జీవితం
రాకుండా ఉండాలంటే......
మన దగ్గర ఉన్న దాంట్లోనే
ఎంతో కొంత దానం చేయాలి
అనే సందేశానికి ప్రతీక
పవిత్ర రంజాన్ పండుగ.
ధనికులు అల్లాహ్ మార్గంలో
నిరుపేదలకు పంపిణీ చేసే
జకాత్ ఇస్లాం ఐదు
నియమాల్లో మూలస్తంభం.
ఆర్థిక సమతౌల్యం సాధించి
న్యాయం చేయగలిగే జకాత్
దానం శ్రేష్టమైంది.
బీదలు జక్కా తో వారి
అవసరాలు తీరి
అల్లా ముందు తప్ప
ఇతరుల ముందు చెయ్యి చాపే
అగత్యం వారికి కలగదు.
దానమిచ్చిన వారి
మిగిలిన సంపద పవిత్రత సంతరించుకుంటుంది.
దాతలు వెలకట్టలేని అంత
పుణ్యం ప్రోది చేసుకుంటుంది
దానం పొందేందుకు
ఎనిమిది రకాల మానవులు
అర్హులని దివ్యఖురాన్ వచనం.
పనిచేసే శక్తి లేక ఇతరులపై
ఆధారపడి జీవించే అభాగ్య జీవులు
ఆత్మాభిమానంతో ఇతరుల
ముందు చెయ్యి చాప లేక
గుట్టుగా కాలం వెళ్లదీసే వారు
జకాత్ వసూలు చేసే ఉద్యోగులు
ఇస్లాం ధర్మ సూత్రాలను
సుస్థిర పరిచేవారు
తీర్చలేని అప్పులు ఉన్నవాళ్లు
పట్టుబడిన బాధితులు
దైవ మార్గంలో ధర్మ తిరస్కార
వ్యవస్థను అంతమొందించే వారు.
రంజాన్ పవిత్ర ఉపవాస దీక్షలో
స్వచ్ఛంద దానం ముఖ్యంగా చేసేవారు
దైవ పీఠం నీడలో ఉంటారు.
రంజాన్ మాసంలో చేసే జకాత్
దానంతో గొప్ప ఫలితాలను పొందుతారు.
( ముస్లిం సోదరులకు, సోదరీమణులకు రంజాన్ ఈద్ ముబారక్ శుభాకాంక్షలతో )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి