మన స్త్రీ జాతికి సహనమే తరగని ఆస్తండి..! (హాస్య కవిత);-"కవి రత్న""సహస్ర కవి"పోలయ్య కూకట్లపల్లి
పుస్తకాల పురుగండి..!
24/7 ఆన్లైన్ కి అంకితమండి..!
వాట్సాప్ ఫేస్ బుక్ కి బానిసండి..!
వాడే...నా మాయదారి మొగుడండి..!

మహా భయస్తుడండి..!
పరమ బద్దకస్తుడండి..!
ఓపికలేని సోమరిపోతండి..!
వంట తెలియని వెర్రివాడండి..!
నాలుగురితో కలిసిపోలేనివాడండి..!
కలుపుగోలుతనం తెలియనివాడండి..!
ఎవరిమీద ఎక్కువ ప్రేమలేనివాడండి..!
అందరిని నమ్మి
మోసపోయే అమాయకుడండి..!
వాడే...నా ముద్దుల మొగుడండి..!

టైంకి పనులు క్రమపద్ధతిలో
చెయ్యడం చేతగాని చవటండి..!
మా బంధుమిత్రులతో
మంచి సంబంధాలులేని అవివేకండి..!
ఆరోగ్యపై ఏమాత్రం శ్రద్ధలేని మొద్దండి..!
వాడే...నా బంగారు మొగుడండి..!

ఎవరికైనా ఆపదొస్తే 
ఏదైనా ఇబ్బందొస్తే అవసరమొస్తే
ఆలస్యంగా స్పందించే అఙ్ఞానండి..!
వాడే...నా అమాయకపు మొగుడండి..!

ధనాన్ని ఆర్జించడమే తప్ప
దర్జాగా అనుభవించడం తెలియని
అనుభవించే రాతలేని వెర్రి వెంగళప్పండి..!
పరులకోసం పదివేల రూపాయలు
ఖర్చుచేయడానికైనా సిద్దమే కానీ
స్వంతానికి పైసా ఖర్చు చేయడానికి
వెయ్యిసార్లు ఆలోచించే పరమపిసనారండి..!
వాడే...నా పిచ్చి మొగుడండి..!
నేనంటే పడి చచ్చే మొగుడండి..!

వాడితో నా బంధం నలుబది ఏండ్లండి..!
నవ్వకండి...నామాట నమ్మండి...నిజానికి..!
మన స్త్రీ జాతికి సహనమే తరగని కరగని ఆస్తండి..!
ఆ సహనం ఓ వ్యసనమండి! అదే మనకు ఆభరణమండి!


"కవి రత్న""సహస్ర కవి"పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502

కామెంట్‌లు