ముళ్ల జెముడు;-ఎం. వి. ఉమాదేవి
కాక్టస్ పూలు అందం 
ఎడారిలో ఒక చందం 
నీటిని ఆకుల దాచి 
నిరాడంబర పుష్పo !!

ముళ్లని కలిగి ఉంటాయి 
ఎల్లరని దూరం పెడతాయి 
ఎంతటి వేడిమిలోనైనా 
పచ్చగ నిలిచి ఉంటాయి !!

పశువుల నుండి రక్షణము 
నీటి ఎద్దడికి శిక్షణము 
ఎడారి మొక్కలు ఇంతేగా 
గుచ్చితే నీరు తక్షణము !!

కాక్టస్ వలెనే ఉందాము 
స్వీయ రక్షణ అందాము 
పచ్చని పూల మాటలతో 
ఆహ్లాదo కలిగిద్దాము !!

కామెంట్‌లు