పళ్లలో రారాజు";-నలిగల రాధికా రత్న.
వసంతం పక్వానికి వచ్చింది..
మామిడికాయలు విరగకాసింది..
రైతుఇంట తప్పక సిరి 
నిండబోతుందనే 
సంకేతాన్నిస్తోంది..!!

దేవతలకు 
ప్రీతిపాత్రమైన పండుగా..
రుచిలో అమృతంగా
ఔషధ గుణాల్లో
ఆత్మీయ బంధువుగా
ఉత్సాహం ఊపందుకునేలా 
మామిడి 
మనసును మురిపిస్తుంది
చిరుకాలపు వంగడంగా దర్శనమిస్తోంది...!!

ప్రకృతిసిద్దంగా 
కాసే రోజులు కావివి..
రసాయనాలతో..
రంగురంగులతో ..రోడ్లపై 
కనువిందుచేయబోతున్నాయి..!!

"పళ్లలో రారాజును"
రసరాజును నేనేనంటూ 
నోరూరించబోతున్నాయి...!!

ప్రతియేటా మనందరి 
మదిని.. మనీని 
దోచేయడానికి సిద్ధంగా ఉన్నాయి..!!

మామిడి ప్రియులారా!!
తస్మాత్ జాగ్రత్త!!... 
         


కామెంట్‌లు