@ ఏడాదికొక దినం @
@@@@@@@
తన బ్రతుకునే ఫణం పెట్టి, కని
పెంచి, పెద్దచేసిన కన్నతల్లికి...
ఏడాదికొకదినం సందడిగా పండుగచేసేసి
చేతులుదులుపు కునే వైనం !
అమ్మబ్రతుకెంత దైన్యం... !!
ప్రేమ,అనురాగం,ఆప్యాయత
సేవ,త్యాగాలన్నీకలగలిసిన
అమృతమూర్తికి ఇవ్వాల్సింది..
ఏడాదికొక దినమా... !?
మనకుతనజీవితాన్నేఇచ్చేసిందే
మనకోసంఅలుపెరుగకశ్రమించి
అలసి, సొలసి, వాడి... వడలి పోయిందే తను...!
నీ ఆసరా కోసం ఆశగాఎదురుచూస్తోందే !
ఈ దినంతో... నీ ఋణం తీరి పోతుందా... !
అమ్మనుప్రేమగా పలకరించు
ఆప్యాయతతో అన్నం పెట్టు...
పొంగిపోతుంది !
.......ఇంటినుండిగెంటేయక ....ఆ ఈశ్వరుని అమ్మలో దర్శించి
ఉదయాన్నే ఆమె పాదాలకు
భక్తితో నమస్కరిచు !
ఊరటచెందిన ఆ అమ్మఋషి
నిన్నుమహదానందం తో...... దీవిస్తుంది !
అమ్మని అనాథను చేసి.....
నీదారి నువ్ చూసుకుని,ఏడాది కోమారు దినోత్సవం చేసి.....
అమ్మపైబాధ్యతను విడచి, నీ ప్రేమను తద్దినంగా....
మార్చేయకు !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి