పూరీ జగన్నాథ్ ;-ఎం. వి. ఉమాదేవి
పూరి లోనవెలసె పుణ్యజగన్నాథ
తొంగి చూచుటేల తొండి యాడి 
భద్ర సోదరునికి భవ్యమ్ము దొంగాట 
భక్తజనులు చూడ భాగ్యముగను !!

పెద్దకోవెలందు పెనుతరు మూలము 
విగ్రహములు జెక్కి విష్ణు లీల 
గిరిజనమ్ము మురిసి గెంతులు వేయగన్ 
సులభదర్శనమ్ము సుందరాంగ!!

వరుస కుండలెల్ల వాసిగ వంటలు 
తీపి వస్తువులును తీరు తీరు 
విశ్వ ఖ్యాతి నొందె విజయసారథివయ్య 
నిత్యపూజజేతు నిర్గుణాoగ !!


కామెంట్‌లు