స్నేహం;--సుమ


  ఓ హృదయం మరో హృదయం తో 

మమేకమైనపుడు స్నేహం పల్లవిస్తుంది !
నిక్కమైన చెలిమి చేయాలి అంటే 
సంకుచితత్వం వదిలివేసి ... 
విశాలత్వానికి ఆహ్వానం పలకడమే!
మన జీవన వికాసానికి స్నేహ భావనే శ్వాస !
అది లేకపోతే జీవన వని మోడువారుతుంది!
స్నేహాజ్యోతి వ్యక్తిత్వాన్ని జాగృతం చేస్తుంది ... 
మిసిమి చెందిన చెలిమి ... 
కలిమి లేములకు అతీతంగా వర్ధిల్లాలి !
సర్వత్రా  స్నేహ కుసుమాలు 
మమతానురాగాల పరిమళాలు వెదజల్లాలి !
స్నేహితులందరికీ శుభాకాంక్షలు !
x
కామెంట్‌లు