కవితా ఓ కవితా!;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
నీ రూపం
నాకళ్ళల్లో మెదులుతుంది
నామనసులో మెరుస్తుంది
నాపదాలలో మురుస్తుంది

నీ రుచి
నానాలుకకు నచ్చింది
నాహృదిలో తిష్టవేసింది
నాకు ఆనందాన్నిచ్చింది

నీ ప్రేరణ
నాలో ఆలోచనలనురేపింది
నన్ను కలంపట్టించింది
నాతో కవితలువ్రాయించింది

నీ కవ్వింపులు
నన్ను రెచ్చగొడుతున్నాయి
నాతో రచనలుచేయిస్తున్నాయి
నన్ను కవిగా మార్చేశాయి

నీ వలపు
నాలో ప్రేమనుపుట్టించింది
నన్ను ప్రతిస్పందింపజేసింది
నన్ను పిచ్చివాడినిచేసింది

నీ తలపులు
అక్షరాలను దొర్లిస్తుంది
పదాలను పేరుస్తుంది
భావాలను బయటపెట్టిస్తుంది

ప్రియకవితను
ప్రక్కకుపిలుస్తా
పూలదండనువేస్తా
పరవశింపజేస్తా

కవితతో
ఆడుతా
పాడుతా
జీవిస్తా

కవితకు
రంగులు అద్దుతా
అలంకరణ చేస్తా
అందాలు అందిస్తా

కవితా ఓ కవితా
నీవే నాఊహలపల్లకివి
నీవే నాకలలరాణివి
నీవే నామనోరంజనివి


కామెంట్‌లు