మాపాప (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 మాపాప మాఇంట పుట్టింది 
మా ఇంట పండుగ వచ్చింది 
మాపాప మాఇంట పాకింది 
మాఇంట వెన్నెల నిండింది
మాపాప మాఇంట నడిచింది 
మా ఇంట హంసలే నడిచాయి 
మాపాప మాఇంట నవ్వింది
మాఇంట వెలుగులే నిండాయి 
మాపాప మాఇంట పలికింది 
మాఇంట వీణలే మోగాయి 
మాపాప మాఇంట పాడింది
మాఇంట కోకిలలు పాడాయి 
మాపాప మాఇంట ఆడింది 
మాఇంట మేమంత ఆడాము !!

కామెంట్‌లు