వరుణుడు.పురాణ బేతాళ కథ..డాక్టర్. బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 విక్రమార్కుడు చెట్టువద్దకుచేరి శవాన్ని ఆవహించి ఉన్నబేతాళుని బంధించి భుజంపైనచేర్చుకుని నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు ' మహరాజా నీ పట్టుదలమెచ్చదగినదే నాకు వరుణుడు గురించి తెలియజేయి. తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు.
' బేతాళా వరుణుడు అష్టదిక్పాలకులలో ఒకడు. హిందూ మతానుసారం అతడు పడమర దిక్కుకు అధిపతి. వరుణుడిని హిందూ మతం గ్రంధాల ప్రకారం వరుణ దేవుడు, వాన దేవుడు అని అంటారు. అతని నివాసం, స్వేచ్ఛ నీటి అడుగున ప్రపంచానికి విస్తరించింది. ఆదిత్యాలుగా పరిగణించబడే పన్నెండు దేవుళ్ళలో ఒకడని భావిస్తారు.పురాణాల ప్రకారం వరుణదేవుడు కశ్యప రుషి కుమారుడు. కశ్యపునికి అదితి వలన ఆదిత్యులు జన్మించారు.వరుణుడు ఆధిత్యులలో ఒకడు.అదితి అంటే ఎల్లలు లేదా హద్దులు లేంది అని అర్థం.ఆదితి తల్లి నుండి జన్మించినందున వరుణదేవుడుకు అనంతమైన జలాల అధిపత్యం కలిగి ఉన్నాడు.ఇంకా మేఘాలు, వర్షాలను పర్యవేక్షించే అధికారం ఇతనికే ఉంది. మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, అన్ని ఇతర నీటి వనరులను నియంత్రిస్తాడు. మహాభారత కాలంలో పాండవులలో ఒకడైన అర్జునుడిని వరుణుని కుమారుడిగా ప్రశంసించారు.అర్జునుడను అర్జునా, అర్జునా అని ప్రార్థిస్తే ఉరుములు,మెరుపులు బారి నుండి రక్షిస్తుందనే నమ్మకాన్ని ఇప్పటికీ కూడా విస్తృతంగా నమ్ముతారు.
వరుణుడు ఆర్థికంగా ప్రపంచం మొత్తాన్ని శాసించగలడు. పురాతన వేద దేవతలలో ఒకడు. అతను ఆకాశమంత వ్యక్తిత్వం కలవాడు. అతను మేఘాలు, నీరు, నదులు సముద్రాలతో సంబంధం కలిగి ఉన్నాడు.అతను కొన్నిసార్లు ప్రశంసించబడతాడు. విశ్వానికి రాజు అంతటివాడు. అత్యున్నత ప్రపంచంలో నివసిస్తున్నాడు. అతని జ్ఞానం, శక్తి అపరిమితమైనవి.అతను వెయ్యి కళ్ళు కలిగి, ప్రపంచం మొత్తాన్ని పర్యవేక్షిస్తాడు. అందువల్ల అతను నైతిక చట్టానికి ప్రభువులాంటివాడు. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని శిక్షిస్తుంటాడు. కానీ వారు పశ్చాత్తాపపడి ప్రార్థన చేస్తే వారిని కనికరం నుండి క్షమించేతత్వం కలిగి ఉన్నాడు.వాయుదేవుడు ద్వారా గాలిని సక్రియం చేయడం ద్వారా వర్షం, పంటలు ఇవ్వడం ద్వారా జీవితాన్ని నిలబెడతాడు.ప్రారంభంలో వరుణుడు ప్రధాన దేవత అయినప్పటికీ, అతను తరువాత ఇంద్రుడుకు తన స్థానాన్ని ఇచ్చాడు.తరువాతి పౌరాణిక సాహిత్యంలో వరుణను పడమర దిక్కుకు ప్రధాన దేవతగా, మహాసముద్రాలు, నీరు, జల జంతువులకు అధిపతిగా వర్ణించారు. కొన్ని దేవాలయాలలో మొసలిపై స్వారీ చేస్తున్నట్లు చిత్రీకరించబడింది. తన నాలుగు చేతుల్లో రెండింటిలో అతను పాము, పాశం (ఉచ్చు) కలిగి ఉన్నాడు. కొన్నిసార్లు అతను ఏడు హంసలు గీసిన రథంలో స్వారీ చేసి, కమలం, శబ్దం, శంఖం, రత్నాల పాత్రను నాలుగు చేతుల్లో పట్టుకున్నట్లు చిత్రీకరించబడింది.అతని తలపై గొడుగు ఉంటుంది'అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభగంకావడంతో, శవంతోసహా మాయమైన బేతాళుడు తిరిగి చెట్టువద్దకు చేరాడు.పట్టువదలనివిక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.కామెంట్‌లు