బాలలార ఆడుదాం
బాలలార ఆడుదాం
ఎగురుదాం దుంకుదాం
ఆటలన్ని ఆడుదాం
కలిసిమెలిసి తిరుగుదాం !!బాలలార!!
ఏ ఆటలు ఆడుదాం?
బొంగరాలు ఆడుదాం
గిల్లీ దండా ఆడుదాం
దొంగా పోలీస్ ఆడుదాం
చార్ పత్తర్ ఆడుదాం !!బాలలార!!
పులి మేక ఆడుదాం
కైలాసం ఆడుదాం
జారుడుబండ ఆడుదాం
ఒప్పుల కుప్ప ఆడుదాం !!బాలలార!!
సూదిలో దారం ఆడుదాం
చెంచా గోటీ ఆడుదాం
బంతులాట ఆడుదాం
ఉయ్యాలాట ఆడుదాం !!బాలలార!!
గోలీలాట ఆడుదాం
కుర్చీలాట ఆడుదాం
బొమ్మలాట ఆడుదాం
సీకులాట ఆడుదాం !!బాలలార!!
పచ్చీసాట ఆడుదాం
కబడ్డీ ఆట ఆడుదాం
ఖోఖో ఆట ఆడుదాం
దుంకుడాట ఆడుదాం !!బాలలార!!
ముక్కుగిల్లు డాడుదాం
దాగుడుమూత లాడుదాం
వోమనగుంత లాడుదాం
కోతికొమ్మచ్చి ఆడుదాం !!బాలలార!!
బాలలార ఆడుదాం
బాలలార ఆడుదాం
ఎగురుదాం దుంకుదాం
ఆటలన్ని ఆడుదాం
కలిసి మెలిసి తిరుగుదాం !!బాలలార!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి