నానీలు :కోరాడనరసింహారావు

 పుట్టుక ....చావు  !
  చావు ... పుట్టుక !!
    ఇలా..... ఎందాక... !?
       మూటలు కడుతున్నందాక
  *******
 సుఖాలే కోరుకుంటే... 
  ఈ కష్టాలేమిటి... !?
    ఎక్కువ పాపాలే... 
      చేస్తున్నాంగా మరి .... !
   ********
ఎవరి  కోసమో..... 
  రాత్రి తీసాడు గొయ్యి !
    పట్టపగలు వాడే... 
      ...పడిపోయాడు!!
  ********
ప్రేమిస్తున్నానన్నాడు 
  ప్రేమించమన్నాడు 
      కాద0దని ...... 
       గొంతుకోసి చంపాడు! 
  *********
అది... ప్రేమనుకుంది... 
  అన్నీ ఇచ్చేసింది..... 
     మొజు తీర్చింది .... 
        నిజం తెలిసింది !
   ********
కామెంట్‌లు