ఉడత(బాల గేయం);-గుండాల నరేంద్రబాబు ఎం.ఏ (తెలుగు సాహిత్యం).,ఎం.ఏ (చరిత్ర).,ఎం.ఏ (సంస్కృతం).,బి.ఇడి.
ఉడతా ఉడతా రావమ్మా
 ఉల్లాసంగా రావమ్మా

 ఉత్సాహమే నీదమ్మా
ఊయల ఊగగా రావమ్మా

 ఉసిరిక చెట్టు ఎక్కమ్మా
ఊరిని మొత్తం చూడమ్మా

ఉర్వికి అందం నీవమ్మా
  ఊరికి సాయం నీదమ్మా

తాటి చెట్టు ఎక్కమ్మా
లేత ముంజలు తినవమ్మా

 తాటిపండు తినవమ్మా

 త్యాగమంటే నీదమ్మా 

జామపండు తినవమ్మా
జాజిమల్లి నీవమ్మా

===========================
గుండాల నరేంద్రబాబు ఎం.ఏ (తెలుగు సాహిత్యం).,ఎం.ఏ (చరిత్ర).,ఎం.ఏ (సంస్కృతం).,బి.ఇడి.,
తెలుగు పరిశోధకులు  
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం,  తిరుపతి.
తేది:29-05-2022
సెల్: 9493235992.

కామెంట్‌లు