తాజా గజల్ ;-ఎం. వి. ఉమాదేవి
ప్రేమఎంత మాధుర్యం చెలియనడుగు చెబుతున్నది 
విఫలమైతె విషాదమే మనసునడుగు చెబుతున్నది 

నీలికురుల జలపాతం నేటికినీ మరపురాదు 
సంపెంగల పరిమళమీ శయ్యనడుగు చెబుతున్నది 

మెహందీని పెట్టమంటు చేతులలా చాపుతుంది 
సరసాలకు అడ్డుకదా సంజెనడుగు చెబుతున్నది 
 
పూలజడకు చివరిలోన నాగుండే జడకుచ్చులు 
ఊగుతీరు ఉదయానే వెలుగునడుగు చెబుతున్నది 

లేఖఒకటి పంపినాను సంతకమే మరిచినాను 
ఏతీరున గురుతగునో కలమునడుగు చెబుతున్నది

ఏజన్మది ఈ సితార ఈజన్మకు తనివిలేదు 
ఆత్మలోని ఆలాపన తీగనడుగు  చెబుతున్నది 

అనార్ తోట పిలుస్తుంది నవాబులా వెళ్ళలేను 
గులాబీల చెలిచెక్కిట ముద్దునడుగు చెబుతున్నది 

గరీబులా మిగిలానిక ప్రియురాలే దూరమాయె 
పెళ్లికూతురై వెళ్లిన మేడనడుగు  చెబుతున్నది 

వలపుఎపుడు గెలిచిందో కులమతాల అంతస్థులు 
గజల్ లోని భావమిదే ఉమానడుగు చెబుతున్నది !!
*********


కామెంట్‌లు