పల్లీలు (బాలగేయం);- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
పల్లీలమ్మా పల్లీలు 
వేడివేడి పల్లీలు!!

మా అమ్మకు రెండు
మానాన్నకు రెండు
మా తాతకు రెండు
నాకేమో బోలెడు!!

మా అన్న చూశాడంటే
లాగేసుకుంటాడు
మా అక్క చూసిందంటే
లాగేసుకుంటుంది!!

మా చెల్లి చూసిందంటే
బాగా ఏడుస్తుంది
మా తమ్ముడు చూశాడంటే
బాగా ఏడుస్తాడు!!

అందరికీ కావాలంటే 
కావాలండీ బోలెడు
నాదగ్గర ఉన్నాయండీ 
ఒకే ఒక సోలెడు !!


కామెంట్‌లు