నిమ్మకూరు లో
జననం
విజయవాడ లో
పఠనం
మదరాసు లో
ఎదిగిన వైనం
తెలుగు రాజ్యాలను
ఏలిన మననం
నటసామ్రాజ్యానికి
సార్వభౌమత్వం
వెరసి ఒకే నామం
#ఎన్టీఆర్
బృహన్నల గా నాట్యం
ఆడినా...
పార్థుడిగా విల్లు
చేబూనినా...
దుర్యోదనుడిగా
గర్జించినా...
రావణాసురుడిగా
అపచారం చేసినా...
యముడిగా
పాశం విసిరినా...
సాధ్యం ఒక
#ఎన్టీఆర్ కే
సూపరుమాన్ అయి
గగనం లో విన్యాసం చేసినా..
రాజకుమారుడై
కత్తి తిప్పినా..
మేజరయి
రక్తాన్ని ఉరుకలెత్తిచ్చినా..
న్యాయమూర్తి గా
ధర్మానికి బాసటగా నిలిచినా..
ఉపాద్యాయుడై
పాఠం బోధించినా..
బొబ్బిలోపులిలా
గాండ్రించినా..
పార్థసారధై
కురుక్షేత్రన్నీ సాగించినా..
రాఘవేంద్రుని రసరమ్య కావ్యాలలో
సరసమాడినా..
అది పౌరాణికం,
సోషియో ఫాంటసీ.
రాజకీయం.
నవరస రసరమ్యం.
యుద్ధం.
ఛేజింగ్,
షూటింగ్,
ఫైటింగ్,
నవ్వుల పువ్వులు..
ఎలాంటి సినిమాలైన
గుర్తుకొచ్చే
#ఎన్టీఆర్
2రూ..కిలో బియ్యం
మండలవ్యవస్థ
పటేల్..పట్వారి..
వ్యవస్థలను రూపు మార్చి
VRO... MRO లను
రూపొందించి..
మహిళా reservation కు
ఆద్యుడై..
NIMS...30 పడకల
ఆసుపత్రి లకు
ప్రాణం పోసి
వైద్య వ్యవస్థ ను
ప్రక్షాళనం చేసినది
ఎవరూ అంటే
#ఎన్టీఆర్
అప్పటి ఆరుకోట్ల
ప్రేక్షకుల అందాలనటుడు
ఆరుకోట్ల ప్రజల
మెప్పు పొందిన రాజకీయనాయకుడు
తెలుగు జాతి గర్వపడే
నటనాధీరుడు..
నాయకుడు..
అందరూ మెచ్చే
అందరికీ నచ్చే
మరణం లో కూడా
జననం పొందిన
మానవ మూర్తి మన
#ఎన్టీఆర్.
***
అతడంటే ..అతడే ..!!-----సుధాకర్ రెడ్డి. కె--రామకృష్ణాకాలనీ హన్మకొండ..
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి