లోగిలి;- సత్యవాణి
 మా లోగిలి ఒక దేవళం
ఐదు తరాల మనుషులకు
ఆశ్రయం
ప్రేమాభిమానాల మిశ్రమం
అన్నాఆర్తులుండరు అందులో
ఆదరణకునోచని అనాథలూ వుండరు 
పలకరించేవారులేక
పరితపించేవారూవుండరు
హెచ్చుతగ్గుల బేధాలేమాత్రంవుండవు 
లోగిలికి ఒక పెద్దుంటాడు
వేదం అతడి మాట లోగిలిలోవారికి
శాసనం అతడుచూపినబాట
శ్రమపంపకం సజావుగాజరుపుతాడు
క్రమశిక్షణతో లోగిలిని నడుపుతాడు
సత్పౌరులను సమాజానికి
అందిస్తాడు లోగిలిపెద్ద
అదంతా ఒకప్పటిమాటా?
కాదు 
రేపటి తరానికి దిక్సూచి ఈ లోగిలి
        

కామెంట్‌లు