చైతన్య తేజం Dr కందేపి రాణీ ప్రసాద్ బెంగళూర్
తెలంగాణ చైతన్య తేజం సురవరం
తెలంగాణ లో వెలిగే దీపం సురవరం
తెలుగు చరిత్ర వీర రసం  సురవరం
తెలుగు సాహిత్య రత్నం సురవరం

గోల్కొండ కవుల సంచిక ను వేసి
రచన లను వెలికి తెచ్చిన సురవరం
ఆంధ్ర మహా సభ కు అధ్యక్షుడు ఐన
తొలి ఉద్యమ నాయకుడు సురవరం

బహుభాషా కోవిదుడు గా పేరుగాంచిన
అకాడెమీ అవార్డు పొందిన సురవరం
బహు గ్రంథ కర్త గా సంచలనం సృష్టించిన
భావుకత కలిగిన కవీశ్వరుడు సురవరం.
హైదరాబాద్ శాసన సభ కు ఎన్నికై
కాలు మోపిన జన నేత సురవరం
ఉర్దూ భాష రాజ్యమేలిన కాలం లో
తెలుగు పత్రిక తెచ్చిన సురవరం.


కామెంట్‌లు