*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౭౯ - 079)*
 *పరోపకార పద్ధతి*
తేటగీతి:
*ఖండితం బయ్యు భూజంబు వెండి మొలచు,*
*క్షీణుఁడయ్యును నభివృద్ధిఁజెందు సోముఁ,*
*డివ్విధమున విచారించి యొడలు దెగిన*
*జనములకుఁదాప మొందురు సాధుజనులు.*
*తా:*
చెట్టును నరికేసినా కూడా తిరిగి చిగురిస్తుంది. చంద్రుడు క్షీణించినా కూడా మరల పెరుగుతాడు. అలాగే, ఎదుటివారి మంచి కోరే వారు తమకు దుఃఖాలు, కష్టాలు వచ్చాయని ఏమాత్రం బాధపడరు............ అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*భీష్మ పితామహుడు, తనను పెంచి పెద్ద చేసిన రాజ్యం కోసం తన వివాహాన్ని మానుకున్నాడు. కురుక్షేత్ర యుద్దంలో తను ఎంతో ఆదరణతో కొలిచే రాజు, తనని మోసగాడిగా జమ కట్టినా బాధ పడలేదు. ఎందుకంటే, ఏమి జరిగినా, ఎటువంటి స్థితిలో అయినా పాండవులు గెలుస్తారు, ధర్మం వారివైపు వుంది అని తెలిసినా, కౌరవుల కోసం, తను నమ్మిన రాజ సిద్ధాంతం కోసం పోరాడాడు. మనం కూడా, మనకు వలసిన మంచి గురించి కాకుండా, నలుగురికీ మేలు జరగాలని, మంచి చేకూరేలా మన ఆలోచనలు, పనులు వుండాలని అలా పరాత్పరుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ....... .*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు