*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౮౫ - 085)*
 *దైవ పద్ధతి*
తేటగీతి:
*ఫణులు గజములుఁ బక్షులుఁబట్టువడుట,*
*రవిసుధాకరులకునైన రాహుబాధ*
*బుద్ధిమంతుల లేమియుఁ, బొసఁగజూచి*
*విధి బలాఢ్యుఁడటంచు భా వింతు మదిని.*
*తా:*
బుసలు కొట్టే పాములు, మందించిన ఏనుగులు, ఆకాశమే హద్దుగా ఎగిరే పక్షులు ఇవి అన్నీ కూడా ఒకరి చేత పట్టు కోబడుతున్నాయి. సూర్య చంద్రులు గ్రహాలచేత బాధింప పడుతున్నారు. బుద్ధి మంతులు, తెలివి గలవారు, సరస్వతీ పుత్రులకు డబ్బు లేకపోవడం వలన బీదరికము కలుగతోంది. బాగా ఆలోచించి చూస్తే, విధి లేదా దేవుని శక్తి చాలా శక్తి వంతమైనదిగా తెలుస్తోంది........ అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*దైవిక శక్తి ఎంత బలమైనది కాకపోతే, లంకా రాజ్యం లో అశోకవనంలో బందీ అయిన సీతాదేవి, దాశరధితో రాజ్యపాలన చేస్తున్నవేళ మళ్ళీ తాము పద్నాలుగు ఏళ్ల పాటు గడపిన చోటులను చూడాలి అనుకోవడం వింత కాదా!  అన్ని అస్త్ర శస్త్ర విద్యలూ నేర్చుకన్నా కూడా అవి కర్ణునుకి ఉపయోగపడక పోవడం దైవోపహతుడు అవ్వడం వల్లనే కదా! ఇంత బలమైన దైవీ శక్తి మనమందరం లోని మనందరికీ తోడు నీడగా వుండి మనల్ని నడిపించి వైతరణిని దాటించి తనసన్నిధికి చేయి పట్టి తీసుకువెళ్ళాలని వేడుకుంటూ....... .*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు