బ్రహ్మ, నారద సంవాదంలో.....
*ఉమాదేవితో కలసి శివభగవానుడు కనిపించడం - వారే వారి స్వరూపమును వివరిచడం - బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ఒకరే అని నిరూపణము చేయడం.*
*పరమశివుడు ఇంకా ఇలా చెప్తున్నాడు - బ్రహ్మ దేవా! నీకు ఒక రహస్యమైన విషయం చెపుతాను, విను. నేను స్వయముగా నీ భృకుటి నుండి ఉత్పన్నము అవుతాను. హరుడు అనగా శివుడు, నేనే, తామస ప్రవృత్తి కలవాడు అని గదా, లోకులు అంటారు. నిజానికి ఆ రూపములో తామస ప్రవృత్తి యే వర్ణించారు. కానీ ఆ అహంకారము, సాత్వికము కూడా అని తెలుసుకోవాలి. ఎందుకంటే, సాత్వికమనే దేవగణము వైకారిక అహంకారము యొక్క సృష్టి యే కనుక. ఈ సాత్వికము, తామసము అనే గుణములు కేవలము నామ మాత్రములు. నిజానికి ఇవి లేవు. అందువలన "హరుడు" తామసుడు అని చెప్పకూడదు. శివుడు సాత్వికుడే.*
*నా ఆజ్ఞానుసారముగా బ్రహ్మ! నీవు సృష్టి కి నిర్మాతవు అవ్వాలి. విష్ణువు ఆ సృష్టి ని పాలించును. నా ఆంశగా వచ్చిన రుద్రుడు దీనిని నాశము చేయువాడు అగును. "ఉమ" గా ప్రసిద్ధి గాంచిన పరమేశ్వరి ప్రకృతి దేవియొక్క శక్తి వలన పుట్టిన సరస్వతి బ్రహ్మ ను సేవిస్తుంది. ఈ ప్రకృతి నుండి వచ్చే రెండవ శక్తి లక్ష్మీ దేవి నారాయణుని సేవించుతుంది. ఇక మూడవ శక్తి గా కాళి అను దేవత ప్రకటితమై నా అంశ అయిన రుద్రదేవుని సేవిస్తుంది. ఈ విధముగా దేవియొక్క శుభరూప పరాశక్తులను నీకు పరిచయం చేసాను. వీరు వరుసగా సృష్టి, పాలన, సంహారము అను పనులను చేస్తారు. వీరు అందరూ నాకెంతో ఇష్టమైన ప్రకృతి దేవి యొక్క అంశములే.*
*శ్రీహరీ! నీవు లక్ష్మీ దేవి సహకారంతో నీ పని చేయి. బ్రహ్మ! నీవు వాగ్దేవి వెంటరాగా మనాసిక శక్తి తో సృష్టి కార్యము చేయి. నేను నా ప్రియురాలిగా పుట్టిన కాళిని చేరుకుని ప్రళయ సంబంధమైన పనులు నిర్వహిస్తాను. మీరందరూ, మీ మీ కార్యములను చక్కగా నిర్వర్తించుతూ సుఖమును పొందుదురు గాక!.*
*శ్రీ హరీ! నీవు సకల జ్ఞానమునూ సొంతము చేసుకుని సకల జనులకు మేలు చేకూర్చెదవు. నా ఆజ్ఞ వలన అందరికీ ముక్తి దావు అవుతావు. నా దర్శనం వల్ల ఎంతటి ఫలము కలుగుతందో అదే ఫలము నీ దర్శనము వల్ల కూడా కలుగుతుంది. ఈ నా మాట, ముమ్మాటికీ సత్యము. ఇందులో ఎటువంటి సందేహానికీ చోటు లేదు. నా హృదయం లో విష్ణువు వున్నాడు. విష్ణువు హృదయం లో నేను వున్నాను. మా ఇద్దరికీ ఎటువంటి బేధమూ లేదు అని నమ్మి, కొలిచేవారే నాకు అత్యంత ముఖ్యలు, నా ప్రేమ, దయ, కరుణ, ఆదరణలకు పాత్రులు.*
శ్లో:
*మమైవ హృదయే విష్ణుర్విష్ణోశ్చ హృదయే హ్యాహం!*
*ఉభయోరంతరం యో వై న జానాతి మతో మమ!!*
(శి.పు.రు.సృ.9/55-56)
*ప్రళయాన్ని సృష్టి చేసే రుద్రుడు నా నా హృదయము నుండి పుట్టాడు. సృష్టి, స్థితి, లయ కార్యములను సాత్వి కాది మూడు గుణముల ద్వారా, బ్రహ్మ, విష్ణు, రుద్రుడు అను మూడు పేర్లతో నేనే చేస్తాను. శివుడు గుణములలో కొంచెం భిన్నముగా వుంటాడు. ప్రకృతీ పురుషులకు అతీతుడు, అద్వితీయుడు, అనంతుడు, నిత్యుడు, పూర్ణుడు, నిరంజన, నిరాకార పరమాత్మ అయి వుంటాడు.*
*లోకములను పాలించే శ్రీహరి, లోపల తామస గుణము కలిగి బయట సత్వ గుణము కలిగి యుండును. నా అంశ రుద్రుడు లోపల సత్వ గుణము కలిగి బయట తామస గుణము కలిగి యుండును. బ్రహ్మ లోపల బయట కూడా రజో గుణమునే కలిగి యుండును. బ్రహ్మ, విష్ణు, రుద్రుడు ఈ ముగ్గురికీ గుణములు వున్నాయి. కానీ శివుడు గుణాతీతుడు. విష్ణు దేవా! నువ్వు నా ఆజ్ఞ చేత ఈ బ్రహ్మ దేవుని రక్ష చేస్తూ వుండు. నీవు మూడు లోకములందు పూజలు అందుకుంటావు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి