నిక్ అంటే ప్రేరణ; =కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

    కొన్ని పుస్తకాలు చదువుతుంటే మన ఆలోచనలు ఎంత చిన్నవో  అని పిస్తుంటుంది! సమ్మెట ఉమాదేవి గారు వ్రాసిన ఈ అధ్బుత పుస్తకం ఇటువంటిదే.
         'నిక్ అంటే ప్రేరణ' పుస్తకం.ఇది ఒక ఉత్తమ పుస్తకం. నిక్ అనే వ్యక్తిని గురించి చదువుతున్నప్పుడు  అతని జీవితం, ఒక గొప్ప వ్యక్తి గా ఎదుగదల మనల్ని పులకరింపచేస్తాయి!
       నిక్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లోని దుష్క,నికొలాస్ బోరిస్ లకు 1982 డిసెంబర్ 4 న మొదటి సంతానంగా జన్మించాడు.పిల్లాడు అందరి పిల్లల్లాగ లేడు! రెండు చేతులూ రెండు కాళ్ళు లేకుండాపుట్టాడు.ఈ విధంగా పుట్టడాన్ని వైద్య పరి భాషలో 'టెట్రా ఫోకోమెలియా సిండ్రోమ్' అంటారు. కొన్ని కోట్ల మంది లో ఎవరైనా ఒకరికి ఈవిధమైన లోపాలతో పుట్టడానికి అవకాశం ఉంది!దీనికి కారణం జన్యు వ్వస్థ అవవచ్చు.ఈ వ్యాధికి మందులు లేవు.
      ఆ విధంగా పుట్టిన నిక్ కి తినాలన్నా,తన పనులు తాను చేసుకోవలన్నా ఎంత కష్టమో ఊహించండి.అతను ప్రతి పనికీ ఇతరుల మీద ఆధార పడవలసిందే!
       అవసరం అవకాశాల్ని వెతికి పెడుతుంది అన్నట్లు నిక్ గడ్డంకింద స్టిక్ లాటిది పెట్టుకుని లైట్,ఫ్యాన్ స్విచ్చిలు వేయడం నేర్చుకున్నాడు!నోటితో బ్రష్ పట్టితెచ్చుకుని గడ్డంతో పేస్ట్ వత్తి బ్రష్ పైన వేసి అమ్మ చూపిన చోట ఆ బ్రష్ గుచ్చి నోటిని ఇటు అటు తిప్పి బ్రష్ చేసుకునే వాడు! అలా తన చిన్న పనులు నోటితో తలతో చేసుకునేవాడు!
      నిక్ కి చదువుకోవాలనినోటితో కలం పట్టుకుని, కొద్దిగి ఉన్న పాదంతో కష్టపడి రాసుకో గలిగాడు.తరువాత కంప్యూటర్ ఉపయోగించడం నేర్చుకున్నాడు.స్కూలుకు వెళితే తోటి పిల్లలు నిక్ ని విచిత్రంగా చూడసాగారు. అతనికి  ఈ లోపాలు ఉన్నా నిక్ మానసిక ఆరోగ్య బాగానే ఉంది! నిక్ కి ఒక సోదరి సోదరుడు కూడా ఉన్నారు వారివురూ నిక్ ని బాగా చూసుకునేవారు.వారిద్దరూ అందరిలాగే ఉంటారు.
     నిక్ చాలా చురుకుగా ఉండేవాడు.తలతో బంతిని కొడుతూ తోటి పిల్లలతో బంతి ఆడేవాడు.నిక్ కొంచెంపెద్దయ్యాక ఒక ఉపాధ్యాయుడు  వికాలాంగులకోసం నిధులు సేకరిస్తున్న ఒక సంస్థ తరపున మాట్లాడమన్నాడు.నిక్ అద్భుతంగా మాట్లాడి అందరినీ ఆకొట్టు కన్నాడు.నిక్ తన 21 వ సంవత్సరంలో గ్రిఫిత్ విశ్వవిద్యాలయంనుండి అకౌంటెన్సీ,ఆర్థిక ప్రణాళికల అంశాలలో డిగ్రీ పొందాడు.తాను అనేక మందికి స్ఫూర్తిని ఇస్తూ మాట్లాడుతూ సంపాదించడం మొదలు పెట్టాడు.
       ఆ విధంగా నిక్ అనేక దేశాలు తిరిగి తన ప్రసంగాలు వినిపించాడు.నిక్ లో దైవ చింతన కూడా ఉంది.అనేక చోట్ల ఆధ్యాత్మికంగా ప్రసంగించేవాడు.
       2005లో నిక్ 'లైఫ్ వితౌట్ లింబ్స్' అనే సంస్థను స్థాపించి అందులో తన లాటివారిని,ఇతర అంగవైకల్యం ఉన్నవారిని చేర్చుకునివారందరికీ ప్రేరణాత్మక సందేశాలు ఇచ్చేవాడు.
      2007 లో 'ఆటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్' అనే సంస్థనుకూడా స్థాపించాడు.నిరాశలో ఉన్న వారిలో మంచి అభిరుచులను పెంపొందించి వారిలో మార్పు తీసుకరావడానికి కావలసిన బృందం ఇందులో ఉంటారు.
నిక్ 8 పుస్తకాలనుకూడా వ్రాశాడు.2010 లో నిక్ వ్రాసిన 'లైఫ్ వితౌట్ లిమిట్స్'అత్యధికంగా అమ్ముడు పోయిన పుస్తకం.30 భాషలలోకి అనువదింపబడింది.
       ఇప్పుడు అర్థం చేసుకోండి మనకి అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా ఈ పని  చేయలేను,ఆపని చేయలేను అంటూ ఉస్సూరు మనే వాళ్ళు తమను తాము సంహ్కరించుకొని మేల్కోవాలి.
      నిక్ ని కానే మియిహర అనే ఆమె అతని ఆత్మ సౌందర్యాన్ని చూసి 2008లోపెండ్లి చేసుకుంది.కానే నిక్ కు ఎంతో తోడ్పాటు అందించింది.ఇతనికి ఇద్దరు పిల్లలు ఇద్దరు మామూలుగా పూర్తి అవయవాలతో జన్మించారు.
     'ది బటర్ ఫ్లై సర్కస్' అనే లఘు చిత్రంలో నటించాడు.ఇది కూడా స్ఫూర్తిని నింపే చిత్రమే.నోటిలో పెన్ పెట్టుకుని నిక్ ఆటోగ్రాఫ్లు ఇచ్చేవాడు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు, విశేషాలు నిక్లో ఉన్నాయి--------
 నిక్ ఒక ప్రేరణోపన్యాసకుడు,నిక్ గొప్ప స్నేహితుడు.గోల్ఫ్,ఈత,సర్ఫింగ్ లో నేర్పరి! ఒక గాయకుడు గొప్ప రచయిత! ఒక సాహసి!పురస్కారాల గ్రహీత.
      ఇప్పుడు చెప్పండి అన్ని అవయవాలు సక్రమంగా ఉండి ఏ పని చెయ్యలేక పోయే వారు అంగవైకల్యం (మానసికంగా) ఉన్నవారా? ఎన్నో సాధించిన చేతులులేని ఈనిక్  అంగవైకల్యం ఉన్నవాడా? భగవంతుడు మనకు అధ్బుత జీవితం ఇచ్చాడు దానిని మరింత ఉత్తమంగా మలచుకోవడంలో ఉంది నిజమైన జీవితం.
    అన్నట్టు నిక్ పూర్తి పేరు 'నికోలస్ జేమ్స్ వుయిచిన్'
    ఇది అందరూ చదవాల్సిన పుస్తకం, ముఖ్యంగా పిల్లలందరూ చదవాలి ఈ మంచి పుస్తకాన్ని.ఇంతమంచి పుస్థకాన్ని తెలుగులో ఫోటోలతో సహా అందించిన స.ఉమాదేవి గారు అభినందనీయులు.
      128 పేజీలు ఉన్న ఈ పుస్తకం ఖరీదు 250 రూపాయలు పుస్తకం కావలసినవారు స.ఉమాదేవి గారిని చరవాణిలో(9849406722) సంప్రదించండి.
                 ****************

కామెంట్‌లు