కుల మన్న మాట సమాజంలో పాతుకుపోయిన విషయం అందరికీ తెలుసు. నా కులం గొప్పది, నీ కులం చిన్నది అని ఎద్దేవా చేసుకోవటం కూడా మనం చూస్తూ ఉంటాం. ఒక బ్రాహ్మణ కుర్రవాడు తన వయసు వాళ్లతో ఆడుతూ తనను అంటుకోవద్దు అంటాడు. మీరు శూద్రులు నాకు అంటు వుంది అనడం గమనిస్తే అంత చిన్నతనంలోనే వాళ్ళకు పెద్దవాళ్లు నూరిపోస్తూ, సమాజాన్ని చిన్నా భిన్నం చేస్తున్నారు.
ఆ చిన్న వయసులో పాతుకుపోయిన ఆ తేడా జీవితాంతం పనిచేస్తూ ఉంటుంది. అసలు కులాలు ఎందుకు ఏర్పడ్డాయి? ఎలా ఏర్పడ్డాయి? సమాజంలో ఆ వ్యక్తి చేసే పని వల్ల అతని గుణం వల్ల అని గీతలో చెప్పబడింది. ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిని ఎంచుకుని జీవనోపాధిని పెంచుకుంటారు. ఒకరు రోడ్లు ఊడుస్తూ ఉంటే, ఒకరు బట్టలు ఉతుకుతూ ఉంటే, మరొకరు బట్టలు కుడుతూ ఉంటే ఇంకొకరు జుట్టు కత్తిరిస్తూ ఉంటారు. అతని మనసుకు నచ్చిన తాను చేయగలిగిన పనులు ఎంచుకొని కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. ఎవరైనా తల్లి గర్భంలో నుంచి ఒకలాగే బయటకు వస్తారు పెద్ద కులం వారిని కోస్తే రక్తం ఎర్రగానే ఉంటుంది, తక్కువ కులం వాళ్లను కోసినా అలాగే ఉంటుంది. ప్రకృతిలో కులాల తేడా రావడానికి కారణం బ్రతకడం కోసం వారు ఎంచుకున్న పద్ధతి. అసలు కులము అంటే అర్థం ఏమిటి? విభజన. నీవు ఈ కూలి పని చెయ్ ఏ రోజు సంపాదన ఆ రోజు తెచ్చుకో నేను పాలేరుగా ఉండి సంవత్సరానికొకసారి తెచ్చుకుంటాను అని అతను నిర్ణయించుకుని ఆ పని చేయడానికి అంగీకరిస్తాడు తప్ప పుట్టుకతోనే ఈ పని చేయాలని అతను నిర్ణయించుకోడు. కులము అనే పేరుతో గొప్పతనాన్ని ఆపాదించుకుని అందరిని హీన పరచకూడదు అని వేమన వాదం.
కులము అనే శబ్దం ధనంతో ముడిపడి ఉంది చిన్న కులంలో పుట్టిన వాడైనా ఎక్కువ ధనం సంపాదించే వారికి సమాజంలో గౌరవం ఎక్కువ. అదే పెద్ద కులంలో పుట్టినా ధనం లేకపోతే అతనంటే చాలా చిన్నచూపు ఉంది అంటే ప్రజలలో కులానికి లేని విలువ ధనానికి ఉన్నది అని వేమన
సామాన్య జనులకు అర్థమయ్యేలా తన పద్యాలతో
తెలిపారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి