ప్రకృతికి పలపక్షమా!?;-ప్రభాకర్ రావు గుండవరం;ఫోన్ నం.9949267638
నీరులేక తేమ లేక
బీడువారే నా భూమి
వాన కోసం ఎదిరి చూసి 
నా కళ్ళల్లో నీళ్లు ఇంకే

నీరు నిండిన కారు మబ్బులు 
నా మడి దాటి పోతూంటే 
తాడు కట్టి బంధించి
నా మడిలో పిండినాను

ఏమి కాలమొచ్చే కదా
ప్రకృతికి  పలపక్షమేనా!?
ఎండిన మళ్ళు కానరావా
ఈ నల్లటి మేఘాలకు

మనుషులకే అనుకున్న
మోసాలు ద్వేషాలు
కాకపొతే ఏమిటీ
ఓ చోట వర్షం మరో  చోట ఎండ

మనుషుల్లో అఘాయిత్యాలు
ప్రకృతి వైపరీత్యాలకు కారణమా!!?
            🌹🌹🌹


కామెంట్‌లు