బోనాల పండుగొస్తూంది;-ప్రభాకర్ రావు గుండవరంఫోన్ నం.9949267638
ఆషాడమొస్తూంది
అమ్మవారు వస్తూంది
బోనాల పండుగతో
ఊరూరు ఊగుతుంది

ఏడుగుళ్ల దేవతలు
ఎంతో ముస్తాభైతారు
ఊరి నిండా జాతరతో
జనం నిండి పోతూంది

ఎటు చూసినా మైకులే
అమ్మవారి పాటలే
పోతురాజు గంతులతో
పల్లె పులకరిస్తూంది

పల్లె మొదలు బస్తీ వరకు
ప్రతీ ఇంట్లో బోనమే
అమ్మవారికి నైవేద్యాలు
అఖండంగా జరుగుతాయి 

పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మ
పెద్దమ్మ మారాలమ్మతో కలిసి
పోలేరమ్మ వస్తూంది ఏడుపాయల
దుర్గమ్మతో కొలువుదీరి ఉంటారు

ఊరంతా కాపాడుతూఅందర్నీ రక్షిస్తారు
ఏ రోగాలు రాకుండాదుష్ట శక్తుల తరిమేస్తారు
దేశం లో సంక్షోభం లేకుండా చేస్తారు
అందరికిఆశీస్సులుఇచ్చిఅదృశ్యమైతారు

కామెంట్‌లు