అక్షరదీపం వెలిగిందీ
అందరు మీరు రారండీ
అన్నా!చెల్లీ!అక్కా!తమ్మీ!
అక్షరాలు మీరు నేర్వండీ
అందమైన "అ ఆ "లను దిద్దీ
"ఇ ఈ " "ఉ ఉ " వ్రాయండి
"ఋ ఋ "లు ల్లూ " ముద్దుగ వ్రాసి
"ఎ ఐ " " ఓ ఔ " చదవండి
అందరు కలిసి ఆడుతు పాడుతూ
"అం ఆ : అంటూ వ్రాయండీ
కమ్మని చదువు చదువండీ
అమ్మ భాషను నేర్వండీ
సదువుల తల్లి సరస్వతి
చదువులు చెప్పే సదువమ్మ
సల్లని దయతో చెప్పే సదువును
సక్కగ మనము నేరుద్దాం
"క ఖ " " గ ఘ " వ్రాస్తూ మనము
"ఇన్యా " చ ఛ " లు దిద్దాలి
కమ్మగా పాటలు పాడాలి
జర జర మని "జ ఝ " వ్రాస్తూ
"ఞ " " ట ఠ"లు దిద్దాలి
చక్కగా ఆటలు ఆడాలి
"డఢ " అంటూ ఢంకను కొట్టి
"ణ " " త థ " లు దిద్దాలి
హాయిగా " ద ధ " వ్రాయాలి
నవ్వుకుంటూ "న " " ప ఫ " వ్రాసి
"బ భ " బాగా దిద్దాలి
ఎగిరి గంతులు వేయాలి
మంచిగా "మ య " వ్రాయాలి
గుండ్రగా "ర ల " దిద్దాలి
చక్కిలి గింతల "వ శ ష "లు
చక్కగ వ్రాసి చూపాలి
సంతోషంతో "స హ " వ్రాసి
గజ్జెల రవళి "ళ " ను దిద్దీ
"క్ష " అంటూ పలకాలి
బండ "ఱ " ను బాగా వ్రాసి
చిందులు వేస్తూ ఎగరాలి
పలకా బలపము బట్టి
టీచరమ్మకు మొక్కాలి
చక్కని చదువును మంచిగ చదివి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి