చిత్ర స్పందన /;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
 అనయము రామ రామ యని యా హనుమంతుడు పల్కు చుండి తాన్
ఘనమగు సాగరంబునట గ్రక్కున దాటెను శక్తి యుక్తుడై
మనమున రామ మంత్ర మును మక్కువగా జపియించు వారికిన్
క్షణమున శక్తి కల్గి భవ సాగర మీది తరింతులెల్లరున్ //


కామెంట్‌లు