శబ్ద సంస్కృతి!సేకరణ..;అచ్యుతుని రాజ్యశ్రీ

 బక్షీ అంటే సైన్యం లో ఆఫీసర్ అని అర్ధం. చెంఘిజ్ఖాన్  తాతార్ జాతివారు ప్ర యోగించిన పదం!బౌద్ధ భిక్షువులను  బక్షీ  అనేవారు. క్రమంగా మఠంలోని గుమాస్తాకి ఆపదంని వాడారు. బాబర్ కాలంలో  సర్జన్ శల్యచికిత్సకుడికి వాడేవారు. పశ్చిమ టర్కీలో  దర్బారీ కవి అనే అర్ధం లో వాడేవారు. కిర్గిజిస్తాన్ వారు మాంత్రికుని ఈ పేరు తో పిల్చేవారు.మొగల్ పాలకులకాలంలో సైన్యంకి డబ్బు పంపిణీ చేసే వారికి వాడారు.
 శబ్దం_వాడుకలో అర్ధం.
గోష్ఠి అంటే ఆధ్యాత్మిక విషయాలు చర్చించడం.ఒకే భావాలు వయసు బుద్ధి సమానవిద్య అంటే మనపరిభాషలో క్లాస్ మేట్స్ ఒకచోట చేరి ఏవిషయంపైన ఐనా చర్చించటం.కావ్యాలగూర్చి అందులోని కల్పనలు వాటి వివరాలు లోతుగా సమీక్షలు చేయటం! ఇప్పుడు కూడా కావ్యగోష్ఠి  కవిగోష్ఠి అనే పదాలు వాడుకలో ఉన్నాయి.మరాఠీ భాషలో మామూలుగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయటం అనే అర్థంలో వాడుతున్నారు.
గోస్వామి అనేపదం గోసాయి గా మారింది.గోవుల స్వామి  అసలు మూలార్ధం.ఆవులే సంపదకాబట్టి ధనవంతుని గోస్వామి అంటారు. క్రమంగా యోగులకు కూడా ఆపదం వాడసాగారు.గోస్వామి తులసీదాసు అని రామచరితమానస్ కవి మనందరికీ సుపరిచితుడు.ఆయనే హనుమాన్ చాలీసా రాశారు. వేదాంత పరంగా చెప్పాలి అంటే ఇంద్రియాలు నిగ్రహించి నవాడు అని అర్ధం.ఇప్పుడు హిందీ భాష లో పూజారి అనే అర్థంలో వాడుతున్నారు.

కామెంట్‌లు