బడి గంట మోగింది (బాల గేయము);-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
మోగిందమ్మా మోగింది
బడి గంట మోగింది
వచ్చారమ్మా వచ్చారు
గురువులు బడికి వచ్చారు

తీసారమ్మా తీసారు
పిల్లలు పరుగులు తీసారు
చే రారమ్మా చేరారు
బడికి వారు చేరారు

చూసారమ్మా చూసారు
గురువులనేమో చూసారు
పెట్టారమ్మా పెట్టారు
గురువులకు దండం పెట్టారు

పొందారమ్మా పొందారు
గురువుల దీవెన పొందారు
పిల్లలంతా కలిసారు
ఎంతో సంతోషంగా ఉన్నారు


కామెంట్‌లు