ఆయనది
కళాహృదయం
కవిత్వంనుండి
చిత్రకళ వరకూ
అలుపెరగని
శ్రామికుడాయన !
సామాన్యుల్లో.
అతిసామాన్యుడిగా
కనిపించే ఆయన
జీవితం యావత్తూ
వామపక్షభావాలతో
పెనవేసుకుపోయింది !
కలాన్నీ ..కుంచెనూ
సమానస్థాయిలో
నడిపించిన --మహా,
ఘనుడాయన ....!
'ఫ్రీవెర్స్ ఫ్రంట్' అంటే
కందుర్తి తర్వాత
గుర్తుకొచ్చేది ఆయనే ..!
అంటే ..మన 'శీలావి'
సాహిత్యలోకం కొల్పోయిన
సహృదయనేస్తం ...
శ్రీ శీలా వీర్రాజు ....!!
*
నిశ్శబ్ద ..కళాతరంగం ..!!---డా.కె.ఎల్.వి.ప్రసాద్-హన్మకొండ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి