పిల్లలు చల్లిన గింజలు (బాల గేయము);-ఎడ్ల లక్ష్మి
పిల్లలందరు వచ్చారు
గట్టి గింజలు తెచ్చారు
మట్టి లోన చల్లారు
చిట్టి మొలకలొచ్చాయి

పుల్లలు కొన్ని తెచ్చారు
మెల్లగా పాదు నాటారు
తల్లి వచ్చి చూసింది
చల్లటి నీళ్లు పోసింది

చిన్నగా చెట్లు ఎదిగాయి
కొన్న మొగ్గలు వేసాయు
కన్నా వాటిని చూశాడు
చిన్నగా వాడు నవ్వాడు

పువ్వు లేమొ పూసాయ
గువ్వపిట్టలు చూసాయి
రివ్వున లేసి వచ్చాయి
పువ్వుల మీద వాలాయి


కామెంట్‌లు