మళ్ళీ వచ్చాయ్ !!;-ఎం. వి. ఉమాదేవి
మళ్ళీ వచ్చాయ్ 
మామిడిపండ్లు 
గుత్తులుగున్నయ్ 
తీయని పండ్లు !

కమ్మని వాసన 
కలిగిన పండ్లు 
తినగా  శక్తిని 
ఇచ్చే పండ్లు !

బంగిన పల్లి 
రసాలు చూడు 
అంటు మామిడి 
నీలం పండ్లు !

ముక్కలు కోసి 
పళ్లెంలో పెట్టు 
అన్నం లోకి 
తినాలి ఒట్టు !!

ఫ్రిజ్లో పెడితే 
ఐస్ క్రీమ్ లాగా 
చల్లగా తీయగా 
మైమరుపేగా !!

కామెంట్‌లు