కేశవ శంకర్ పిళ్లై అంటే ఎవరికీ తెలీదు. భారతీయ కార్టూన్లకు ప్రాణంపోసి రాజకీయ నేతలను అగ్గగ్గలాడించిన మహా మేధావి విమర్శకుడు. గాంధీ జిన్నా నెహ్రూ ఇందిరాగాంధీల పై కార్టూన్లుగీశాడు.1952నుంచి అంతర్జాతీయ బాలల చిత్ర కళాపోటీలు నిర్వహించారు. నేషనల్ చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్ నెలకొల్పారు.ప్రపంచంలోని అన్ని రకాల బొమ్మలతో ఓమ్యూజియంని ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ వల్ల శంకర్స్ వీక్లీ మూతబడింది.
రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ విఫలంపై ఆయన గీసిన కార్టూన్ తో బొంబాయి లో ఒక్క సారి గా అందరిదృష్టిలో పడ్డాడు. సర్ శామ్యూల్ ని పోలీస్ గా గాంధీని జనంగుంపుగా గీసి"పోలీసులు జనాన్ని చెదరగొట్టారు" చూసి హిందుస్థాన్ టైమ్స్ లో ఉద్యోగం ఇచ్చారు యాజమాన్యం వారు.నెహ్రూ ప్ర ధానిగా ఉన్న రోజుల్లో ఓపెద్ద చెత్తకుండీలో వరాహం ముట్టెతో నెహ్రూని గీశాడు. కానీ నె…
: కొంతమందికి ఎక్కడకీ వెళ్లటం సభల్లో పాల్గొనటం ఇష్టం ఉండదు. ఆకోవకి చెందినవాడే ప్రసిద్ధ కళాకారుడు జైమినీరాయ్! దేశవిదేశాల్లో పేరు పాకింది. సన్మానంచేస్తాం రమ్మన్నారు. "ఉహు!కలకత్తా విడిచి కాలు బైట పెట్టను"అని నిర్మొహమాటంగా చెప్పేవాడు.ఆస్టిన్ కోట్స్ ఇలా రాశాడు "ఢిల్లీకి రానుపోనూ ఫస్ట్ క్లాస్ రైలుటికెట్స్ ని కేంద్ర ప్రభుత్వం పంపింది.సన్మానం ఏర్పాటు చేశాంరమ్మని ఫోన్ చేస్తే శ్రీ రాయ్ ఇచ్చిన జవాబు ఇది" ఆసన్మానంని ఇక్కడికే పంపించవచ్చు కదా?" ఇకచేసేదిలేక ఢిల్లీ వారు కలకత్తా లోనే సత్కరించారు.
==================
కొన్ని దశాబ్దాల క్రితమే వయోజనవిద్యకి దృశ్యమాధ్యమంద్వారా విద్యా బోధనకార్యక్రమాలు ఉండాలి అని సూచించారు శ్రీ మాల్కం ఆదిశేషయ్య.పద్మభూషణ్ పొందిన ఈయన లండన్ లోఆర్ధిక శాస్త్రంలో డాక్టరేట్ చేశారు. ఎన్.సి.ఇ.ఆర్.టి. .ఐ.సి.ఎస్.ఎస్.ఆర్.మొదలైన సంస్థలకి ఊతగా నిల్చారు.40దేశాల సత్కారాలు 15 యూనివర్సిటీల గౌరవ పట్టాలు అందుకున్నారు. ఆయన భార్య ఎలిజబెత్ కూడా వయోజనవిద్య ప్రణాళికకు రంగు రూపు ఇచ్చారు. తన 2కోట్ల విలువైన ఆస్తిని మద్రాసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్ కి విరాళం ఇచ్చారు. పిల్లలు ఇద్దరు లండన్‌లో స్థిరపడ్డారు. ఇక మద్రాసు క్రిస్టియన్ కాలేజ్ లోబిరుసు పెళుసు ప్రొఫెసర్ అని ప్రిన్సిపాల్ తో సహా అందరికీ తెలుసు!కానీ ఎవరూ నోరెత్తేవారుకాదు.కాలేజీ రూల్సు పాటించనివ్యక్తి! క్లాసులోకి ప్రవేశించేముందు సిగరెట్ పారేసి ముక్కు నోటిలో నించి పొగ గుప్పున వస్తుంటే సరాసరి పాఠం మొదలు పెట్టేవాడు. నిర్లక్ష్యంగా కోటు కుర్చీపై విసిరి పిల్లలు ఉన్నారా వింటున్నారా లేదా అని కూడా చూడకుండా గడగడ పాఠం చెప్పి ముగించి వెళ్లేవారు. వింత ఏమంటే మిగతా క్లాసులు ఎగ్గొట్టి ఈయన క్లాస్ లో మాత్రం పిల్లలు ఫుల్ హాజర్!మద్రాసు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి