స్వీకరణ! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఒకసారి బుద్ధుడు రాజగృహం ప్రాంతంకి వెళ్తూ వేల్బన్ అనే చోట విశ్రాంతికోసం ఆగాడు. ఆయన ప్రచారం ప్రభావంతో ఎంతో మంది సన్యాసులుగా మారటంతో చాలా మంది తల్లి దండ్రులకు కడుపు మండసాగింది.తమ వృద్ధాప్యం లో ఉద్ధరిస్తాడని పెద్ద కొడుకు పై ఆశలు పెట్టుకున్న వారు బుద్ధుని  నిందించేవారు.తమపెద్దకొడుకు చెప్పాపెట్టకుండా భిక్షువు గా మారటంతో ఒక తండ్రి ధుమధుమలాడుతూ  బుద్ధుని దగ్గరికి వచ్చి ఛడామడా నిందించసాగాడు."ఏమయ్యా!నీవంటే రాజవంశంలో పుట్టావు.పెళ్ళి పేరంటం ఐనాక పిల్లాడు పుట్టగానే సన్యాసి వైనావు.నీకు అన్ని కోర్కెలు తీరాయి.బాధ్యతలు పక్కకు నెట్టి సత్యాన్వేషణ అని  బైలుదేరావు.మరినేను ఓసామాన్య రైతుని.ఆరుంగాలాలు కష్టించి రెక్కలు ముక్కలు చేసుకుంటే గానీ బతుకు వెళ్లదు."అని అక్కసంతా వెళ్లగక్కాడు.శాంతంగా బుద్ధుడు ఇలా అన్నాడు "నీఇంటికి బంధువులెవరైనా వస్తారా? వారి కి  ఉన్నంతలో మంచి వంటకాలు పెడతావా లేదా?"  "ఎందుకు పెట్టనూ?రాకరాక వచ్చిన వారికి మాఇంట్లో వారమంతా పొట్ట మాడ్చుకుని మాకున్నంతలో సంతృప్తిగా పెడతాం.అతిధి సాక్షాత్తూ భగవంతుడు!"."సరే! అతను  ఏమీతినకుండా  వెళ్లి పోతే ఆవంటకాల గతి ఏంటి?"
"మాదగ్గరే ఉంటాయి. మేమే తింటాం"."అలాగే నీతిట్లు నాకు వడ్డించిన భక్ష్యభోజ్యాలు! కానీ నాకు ఆకలిగా లేదని తినకుండా వెళ్లి పోతాను.ఆతిట్లు నిందలు నీవద్దే ఉంటాయి. మనం ఇచ్చే వస్తువులు  ఎవరైనా తీసుకోకపోతే అవి మన దగ్గరే ఉంటాయి కదూ?" ఆవ్యక్తి నోరు మూతబడిందని వేరే చెప్పాలా?"
కామెంట్‌లు