తన దాకా వస్తే! అచ్యుతుని రాజ్యశ్రీ

 శివయ్య  గుడిపూజారి. ఎప్పుడూ దైవస్మరణతో ఓంనమశ్శివాయతో భక్తులతో ఆత్మీయంగా ఉంటాడు. అంతా ఆయన్ని అయ్యగారూ అని సంభోదిస్తారు.ఆలయంకి రోజూ  ఓగర్వపోతు వస్తాడు.అతని పేరు శేషయ్య. ఎంత సేపటికీ తన సంపద దర్పం ప్రదర్శిస్తూ ఇతరులని కించపరిచేవాడు.గుడి కి వచ్చి  దైవం పూజ  నామస్మరణ పై దృష్టి పెట్టకుండా  వ్యాపార విషయాలు  రాజకీయాలు మాట్లాడటం చేసేవాడు. "ఆ!ఏదైనా మన చేతుల్లోనే ఉంది. రాతివిగ్రహాల్లో ఏమి ఉంటుంది?" అని అవాకులు చెవాకులు పేలేవాడు."మరి ఎందుకు వస్తావు శేషయ్యా?"ఓవృద్ధుడు అడిగాడు. "ఎందుకేంటి?మాతాతముత్తాతలు కట్టించిన గుడి.ఆవిగ్రహాన్ని  ప్రతిష్ఠ చేయించింది మాతాత! ఇన్ని పూలదండలు ఊదుబత్తీలు కర్పూరం నూనె దీపాలు అవసరమా?దేవుని పేరుతో మీరు డబ్బు దండుకుంటున్నారు. "చాలా దురుసుగా అన్నాడు. అంతే ఆలయంలో ఉన్న వారికి  కోపం వచ్చింది. "నీకు దేవుడు భక్తి లేకపోతే రాకు.తులసివనంలో గంజాయిమొక్కలా పుట్టావు. మాలాగానే రా!చేతుల కి ఉంగరాలు  కంకణం గొలుసు  ఎందుకు?" "మీకెందుకంత కుళ్ళు?మాతాత ముత్తాతలు చెవులకు బంగారు పోగులు గొలుసులు వేసుకునేవారట! నిజంగా  దేవుడుఉంటే కనపడాలి కదా? దశావతారాలు దాదాపుగా జంతువులే గదా?"వితండవాదం మొదలుపెట్టాడు.మూర్ఖుడితో వాదన కంఠశోష  అని ఊరుకున్నారు అంతా! పూజారి శివయ్య  విని ఊరు కున్నాడు.బురదమీద రాయివేస్తే మొహాన చిందుతుంది.  ఓరోజు శేషయ్య  "మానాన్న పుట్టినరోజు జయంతి వేడుక సందర్భంగా భోజనాలకి రండి"అని ఆహ్వానించాడు.అతని తండ్రి రామయ్య పై ఉండే అభిమానం తో వెళ్లి భోజనాల కి కూచున్నారు. కేవలం పులిహోర దద్ధోజనం రవ్వలడ్డుతో విందు ముగించారు అంతా!ఆఊరికి కాస్త వెన్నుదన్నుగా నిలిచే రాజు పెద్దగా అరిచాడు "మీనాన్న ఫోటో ఎందుకు దండగ?అవతలపడేయ్"అనగానే  తాడెత్తున లేచాడు శేషయ్య!"మానాన్నని అవమానిస్తావా?ఇప్పుడేగా ఆయన ప్రసాదం మెక్కావు?నిన్ననే ఎన్లార్జ్ చేయించా.ఈఫోటోతో గదికి అందం వచ్చింది. మానాన్నని అంటానికి నీకెన్ని గుండెలు?"
"అలా దారికి రా! ఫోటో లో ఉన్న మీ నాన్నని గౌరవిస్తున్నావు.మరి అనాదిగా దేవుడు భక్తి తో పునీతమైన పౌరాణిక  చారిత్రక ఆధారాలు ఉన్న దేవుళ్ళకి అలంకారాలు పూజ పునస్కారాలు దండగ అని అనటం పాపం కాదా?అంతా విగ్రహం రూపంలో దైవాన్ని కొలిచి అలంకరిస్తారు. దైవంపేరు చెప్పి మనమే ప్రసాదాలు మెక్కుతున్నామా లేదా?" అంతే శేషయ్య కి బుద్ధి వచ్చి ఇక ఆలయపూజాపునస్కారాల గూర్చి చెత్తగా వాగటం మానేశాడు.దైవం పాపం అనే భయం లేకుంటే  మనిషి జంతువు గా మారుతాడుసుమా!🌹
కామెంట్‌లు