మహాత్ముడంటారు కానీ
మామూలు మనిషే అతడు...
ప్రేరణగా నిలిచిన ఆయన జీవితం
పూలబాటేమీ కాదు....
గమ్యానికై ఆయన గమనం అంత తేలికైనదేమీ కాదు...
సత్యశోధన చేయడం,
అహింసావాదాన్ని అనుసరించడం,
మాటల అస్త్రాలను ప్రయోగించి
ప్రజలను ప్రభావితం చేయడం,
వేల మైళ్ళ పాదయాత్రలు చేపట్టి
బానిసత్వపు చెరలలో బందీలైన
భారతీయులలో సత్యాగ్రహాల స్ఫూర్తిని నింపుతూ,
శాంతిమార్గానా సుదీర్ఘ పోరాటాన్ని
కొనసాగించడం అనుకున్నంత సులభమేమీ కాదు...
ఆయన సిద్ధాంతాలను విమర్శించిన వారు ఉన్నారు..
శాంతి మార్గాన వారు చేపట్టిన
సత్యాగ్రహాలు సన్నగిల్లిన తరుణాలూ ఉన్నాయి...
అహింసావాదం చాదస్తం అంటూ
కొట్టి పడేసిన వాళ్ళు లేకపోలేదు...
అయినా సరే వెనుదిరగని వ్యక్తిత్వం,
సడలని ఆయన సంకల్పం
స్వరాజ్యాన్ని జయించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాయి...
అందుకే వారు సాధించిన విజయాలే కాదు
లక్ష్యసాధనలో వారు అనుసరించిన మార్గాలు కూడా
నేటి తరాలకు స్ఫూర్తిదాయక మే... అనుసరణీయ్యమే...

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి