చీడ పురుగు;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి.
 ఈ ప్రపంచంలో అంతా మంచి వారే ఉండరు అంతా చెడ్డ వాళ్ళూ ఉండరు. చెడ్డ వారి లోనూ కొంత మంచి ఉంటుంది  మంచి వారి లోనూ కొన్ని  దుర్గుణాలు ఉంటాయి. ఈ చెడ్డ గుణం మనుషులు  ఎదుటివారికి ఉపయోగపడక ఇతరులను తమ ప్రయోజనాల్ని  సిద్ధించుకోవడం కోసం ఈ మంచివాణ్ణి ఆసరాగా తీసుకుంటారు. దుర్యోధన మహారాజు వ్యక్తిగతంగా చాలా మంచివాడు  కానీ మంకుపట్టు పడితే  అంత చెడ్డవాడు మరొకడు ఉండదు. అలాంటి వారిని ఆసరాగా చేసుకుని  తన కార్యాన్ని సాధించడం కోసం  శకుని మిత్రునిగా తనవద్ద చేరతాడు. మంచి మంచి మాటలతో వారిని అందరినీ లోబరుచుకోవడం చేత అతను చెప్పింది వేదమంత్రంగా పాటిస్తారు. దానితో కురుక్షేత్రం ప్రారంభమైంది  100 మంది అన్నదమ్ముల్లో ఒక్కడు కూడా మిగలకుండా సర్వనాశనం అయిపోయారు వారితో పాటు రాజ్యం కూడా. ఇవాళ ప్రపంచం మొత్తం చెట్లను నాటే  పనిలో ఉంది ఎంతో ఉత్సాహంగా  మంచి మంచి మొలకలు తెచ్చి పెంచుద్దాం అనుకున్నా వారికి తెలియకుండా వేరు పురుగు చేరి దానిని సర్వనాశనం చేస్తోంది. చెట్లను సంరక్షించడం కోసం తపన పడే వాడికి  చీడపురుగు ఆ చెట్టును చంపి అతనికి నిరుత్సాహం కలిగిస్తుంది. 
మనం ఏం చేయ దలుచుకుంటామో ప్రకృతి దానికి వ్యతిరేకంగా చేయిస్తూ ఉంటుంది ఇది అనుభవాల్లో  తెలుసుకునే విషయం  వేమన ఎంత నిశితంగా పరిశీలించ కపోతే అద్భుతమైన ఆటవెలదిని మనకు అందిస్తాడు...!కామెంట్‌లు