రామసక్కని గాలిపటం, నాకు నచ్చిన పుస్తకం- కయ్యాల నిఖితతొమ్మిదవ తరగతిజక్కాపూర్, సిద్దిపేట జిల్లా
 ఈ వేసవి సెలవుల్లో "రామ సక్కని గాలిపటం "అనే పిల్లల కథల పుస్తకం చదివాను.చిన్నారి పాపాయి అందమైన ముఖ చిత్రంతో ఉన్న ఈ పుస్తకం లో ఇరవై కథలున్నాయి.ప్రతి కథలో ఒక సందేశం ఉంది. పిల్లలకు నచ్చే విధంగా కథలు ఎంతో ఆసక్తిగా, ఆనందాన్ని కలిగించే విధంగా ఉన్నాయి.రచయిత దుర్గమ్ భైతి  విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేలా చక్కగా కథలు వ్రాసారు.ఇప్పటికే ఈ పుస్తకాన్ని నాలుగు సార్లు చదివాను.



కామెంట్‌లు