పూలప్రేమ;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

తొలికిరణం తొంగిచూడగానె
తూర్పున సూరీడుదయించగానె 
తోటలోనికివెళ్ళి పూలనుపలకరిద్దామని
తలుపుదగ్గరకెళ్ళా తయారయి 

తేటులన్నికూడి
తలుపు దగ్గకుచేరి
అడ్డుకున్నాయి
ఆపాయి

పూలకవీ
పూలనుండిమమ్ము వేరుచెయ్యొద్దని
పూదోటకు వెళ్ళొద్దని
ప్రార్ధించాయి

పూలు ఈమధ్య
పలుకరించుటలేదు
దగ్గరకు వెళ్దామన్న
రానియ్యుటలేదు

తాకనివ్వుటలేదు
తేనెనిచ్చుటలేదు
తరిమేస్తున్నాయి
తత్తరపెడుతున్నాయి

పువ్వులంటే ప్రాణం నాకు
పువ్వులంటే ప్రేమ నాకు
పూలదగ్గరకు పోకుండా ఉండలేను
పోండి పోండి జరగండి ప్రక్కకు 
అని అన్నా 
కోప్పడ్డా 
బిగ్గరగా
అరిచా 

ముక్తకంఠముతో
ముందుకుపోనీకుండా
అప్పుడు ఆతేటులన్ని
అన్నాయి ఇలాగని

చెవ్వుల్లో దూరతాం
ముక్కును ముట్టేస్తాం
చేతులను కుడతాం
కాళ్ళను కరుస్తాం

కందిరీగలను
పిలుస్తాం
కళ్ళను
కుట్టిస్తాం

కాకులను పిలిచి
గోలచేయిస్తాం
గ్రద్దలను పిలిచి
గోళ్ళతో గీకిస్తాం

ఎర్రచీమలను
పిలుస్తాం
వంటినంతా
ప్రాకిస్తాం కుట్టిస్తాం

ఈగలను పిలుస్తాం
మోత మోగిస్తాం
దోమలను పిలుస్తాం
రక్తాన్ని త్రాగిస్తాం

పువ్వులు విషయానితెలుసుకొని
పరుగెత్తుకుంటు వచ్చాయి
తేటులను తిట్టేశాయి
దూరంగా తరిమేశాయి

స్వాగతం పలికాయి
తోటలోనికి తీసుకెళ్ళాయి
సరసాలాడాయి
సంతోషపరిచాయి

పూలప్రేమకు
పరవశించా
పూలకవితలను
పెక్కువ్రాయాలనుకున్నా

పూబాలలకు
దీవెనలు
పూలకు
ధన్యవాదాలు

కామెంట్‌లు