మానుకో యుద్ధము ఓ రష్యా ( బాల గేయం)
ఉక్రేయిన్ దేశ ప్రజలు
చీకటి గదుల లోన
ఉగ్గ పట్టిన బ్రతుకులు
అరచేతిలో ప్రాణాలు

ఎందుకు ఇంత పగలు
మనుషులను చంపుతూ
శవాల మీద నడుస్తూ
సంతోషం ఎందుకో రష్యా

మనిషి ప్రాణం

తీసే నీవు
ప్రాణము పోయ గలవా 
శవాల రాజ్యము ఏలుతూ
సంతోషమేల నీకు ఓ రష్యా

అన్ని ధ్వంసము చేసి నీవు
రష్యా రాక్షసునిగా నిలిచి
ఏమి సాధిస్తావో తెలుసుకోని
మానుకో యుద్ధము ఓ రష్యా

                            
కామెంట్‌లు