నిండు జాబిలీనింగిలో ఉండును ఎందుకనీ?అందరిపై వెన్నెలసమముగ పంచును అందుకనీ!కొబ్బరి చెట్టుకుకొమ్మలు ఉండవు ఎందుకనీ?కాయల బరువుకుకొమ్మలు విరుగును అందుకనీ!నేలను పచ్చికఒత్తుగ మొలుచును ఎందుకనీ?మెత్తని మన్నుకురక్షగ నిలుచును అందుకనీ!తామరాకుపైనీటిబొట్టు నిలువదు ఎందుకనీ?తామరాకుపై మైనపు పొరఉండును అందుకనీ!వాయువు ఎప్పుడూనిలువక తిరుగును ఎందుకనీ?సర్వప్రాణులకుఅవసరమగును అందుకనీ!
ఎందుకనీ? (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి