ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. ;--వెంకట్ మొలక ప్రతినిధి:


 వికారాబాద్ జిల్లా సంఘం లక్ష్మి భాయి తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం.   
నిత్యం యోగా చేసే విద్యార్థుల్లో చదువుసంధ్యలు చురుకుదనం ఉట్టి పడుతుందని అందరిలో ముందు ఉంటారని యోగా గురువులు కె అనంతయ్య  నారాయణ్   రాథోడ్ గౌతం కళాశాల ప్రిన్సిపాల్ బాలకృష్ణ ఎస్ ఎల్ బి ప్రిన్సిపాల్ డాక్టర్ గోపిశెట్టి రమణమ్మలు విద్యార్థినిలకు ఉద్బోధించారు. మంగళవారం SLB గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు విద్యార్థినిలు చేసిన యోగాసనాలు పాటల ద్వారా నృత్యాల ద్వారా యోగా ప్రదర్శనలు చేసి అబ్బుర పరిచారు. యోగా గురువులు విద్యార్థులను అభినందించారు సందర్భంగా యోగా గురువులు మాట్లాడుతూప్రతి వ్యక్తికి విద్యార్థి దశ నుంచి ముసలితనం వరకు యోగ సాధన నిత్యం అవసరమనేది అక్షరాల సత్యం అన్నారు. యోగ చేయడం వల్ల ఆరోగ్యం ఆనందం మానసిక శారీరక ఉల్లాసం ఉంటుందన్నారు. రోగాలకు దూరం కావడంతో పాటు జీవన ప్రమాణం మెరుగుపడుతుందని అన్నారు. యోగాతో వందేళ్లకు పైగా ఆరోగ్యంగా జీవించవచ్చు అని స్పష్టం చేశారు. యోగా చేసే విద్యార్థులు ఇతర విద్యార్థులతో ఖచ్చితంగా ముందుంటారని తెలియజేశారు. ఈ సందర్భంగా యోగా గురువులను పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం సన్మానించి గౌరవించారు.
కామెంట్‌లు