ఆస్తిక నాస్తిక వాదం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి.
 దేవుడు జీవుడు ఈ రెండు శబ్దాలతో ద్వైతం అద్వైతం విశిష్టాద్వైతం ఏర్పడ్డాయి. అసలు దేవుడు ఉన్నాడా లేడా అన్న విషయాన్ని శంకరాచార్యుల వారు కానీ, బుద్ధుడు కానీ ఎక్కడా తేల్చి చెప్పలేదు. జ్ఞానము అన్న శబ్దం మీద వచ్చిన దేవుడు, భగవంతుడు అంటే వెలుగు చూపు వాడు. అది ఎవరో కాదు నీవే అంటూ అహం బ్రహ్మాస్మి అన్న పలుకుతో వివరించారు. కానీ సామాన్య ప్రజలు దేవుని విశ్వసిస్తూనే ఉన్నారు, పూజలు చేస్తూ ఉంటారు  ఎక్కడ దేవాలయం ఉంటే అక్కడికి వెళ్లి దర్శనం చేసుకుని మొక్కి వస్తారు.  వీళ్ళలో రెండు రకాలు ఉన్నారు  తనకు ఏమీ లేని స్థితిలో నాకు దారి చూపమని నా స్థితిని బాగు చెయ్యమని భగవంతుని వెడుతూ ఉంటారు. అష్ట ఐశ్వర్యాలతో తులతూగే వాడు భగవంతుడు అన్న శబ్దాన్ని ఖాతరు చేయడు. వాడెంత అన్నట్టుగానే మాట్లాడతాడు. ఇది భౌతికమా? ఆధ్యాత్మికమా? అన్న విషయాన్ని తేల్చుకోలేని స్థితిలో ఉన్నాడు మానవుడు. తన స్థితి బాగుండనప్పుడు భగవంతుడు గుర్తుకు వస్తాడు  నిజానికి దూషిస్తాడు నీవుంటే నాకు ఇలా జరుగుతుందా ? నీవు లేవు కనుక నేను ఇలా ఉన్నాను అని నిష్టూరాలు పలుకుతాడు. భగవంతునికీ, భక్తునికీ ఉన్న సంబంధం ఎలాంటిది అంటే ఆస్తికులని, నాస్తికులని, హెతువాదులని రకరకాల వాదనలు వినిపించే వారు తాము చెప్పిందే వేదమని ప్రచారం చేస్తూ ఉంటారు. 


కామెంట్‌లు