అద్భుతం!!?--ఆద్య-శ్రీనివాస కాలనీ మహబూబ్ నగర్
ఈ ప్రపంచంలో
అత్యంత ఆకర్షణీయమైనవి
దేవుడు-ధనము-స్త్రీ మాత్రమే!!?

దేవుడు ధనము స్త్రీని పుట్టించలేవు కానీ
స్త్రీ దేవున్ని ధనాన్ని పుట్టిస్తుంది!!?

దేవుణ్ణి ధనాన్ని ఎంతైనా  దోచుకోవచ్చు
కానీ
స్త్రీ మనసును దోచుకున్న వాడే
దేవుని కన్నా ధనవంతుడు!!?

జీవజాతిలో మనిషికి విలువ
మెదడు వల్ల వచ్చింది కానీ
మానవజాతికి విలువ
స్త్రీ -జాతి వల్లనే వచ్చింది!!

మెదడును జయించినా ఏకైక జీవి
స్త్రీ మాత్రమే!!!

మెదడు ఒక అద్భుతం
కానీ
స్త్రీ  ఒక అత్యద్భుతం!!

మెదడు స్త్రీని
శరీర అందము రంగుతో
వివక్ష చూపిస్తుంది
స్త్రీ మెదడును ప్రతిభతో రక్షిస్తుంది!!?

మానవజాతికి మెదడు
ప్రతిభ ను మాత్రమే ఇచ్చింది
స్త్రీ జాతి మెదడుకు
మానవత్వం ప్రేమను సృష్టించి ఇచ్చింది!!?

మనుషులు ఇంకా
కలిసి ఉండడానికి కారణం
స్త్రీ ఇచ్చిన 
మానవత్వం ప్రేమ మాత్రమే!!?

Dedicated to
Gayatri Abhi

Aadya, Srinivasa colony mahabubnagar.

కామెంట్‌లు