జర్నలిస్ట్ బోణం గణేష్ కు శుభాభినందనలు;-ఉమామహేశ్వరి యాళ్ళ
 ఎవరెలా పోతే నాకేమిటనుకునే లోకంలో..
నాకేమిటని లాభాలు చూసే సమాజంలో..
ఉన్నంతలో సాయమందిచాలనే తపన
చేయూతనివ్వాలనే తృష్ణా
నలుగురితో సేవ చేయించాలనే సత్సంకల్పం అతి కొద్దిమందిలోనే చూస్తాం. అలాంటి వ్యక్తులు మనకు అరుదుగా తారసపడుతుంటారు. 
తల్లి దండ్రులు నేర్పిన సంస్కారం, కరుణ నిండిన హృదయం ఇందుకు కారణాలనవచ్చు.
తనకేమీ కాకున్నా....ఎవరో చూడకపోయినా....నాకేమిటని యోచించకుండా... తల్లిదండ్రులు బాధలో ఉన్న తన కుమార్తె స్థితి తెలియగానే ఆరోగ్యం బాగు చేయించాలన్న లక్ష్యంతో వాట్సాప్ స్టేటస్ గా విజయనగరం జిల్లాకు చెందిన నీరజ హాస్పటల్ బిల్లులనూ , తన అనారోగ్య పరిస్థితినీ తెలుపుతూ పదుగురి సహాయం కోరారు.‌అలా సాక్షి రిపోర్టర్ బోణం గణేష్  మొదలుపెట్టిన  యజ్ఞంలో శ్రేయోభిలాషులు, ఆప్తులు, మిత్రులు పంపిన లక్షరూపాయలకు పైగా నగదును సహాయంగా అదందించడం జరిగింది. ఇంత అనారోగ్యంలోనూ నీరజ నేడు విడుదలైన ఇంటర్ పరీక్షఫలితాలలో మంచిమార్కులను సాధించగలిగింది. ఈ సంతోషాన్ని తనదిగా భావిస్తూన్న ఆ నిష్కల్మష హృదయాన్ని అభినందిస్తూ...మరెన్నో సేవా కార్యక్రమాలతో, ఉన్నతమైన పదవులలో పదుగురికీ ఆదర్శంకావాలని‌ ఆశిస్తున్నాను.
ఇట్లు
మిత్రురాలు 
ఉమామహేశ్వరి యాళ్ళ


కామెంట్‌లు
Unknown చెప్పారు…
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Unknown చెప్పారు…
Great sir
Unknown చెప్పారు…
Great sir
GANESH BONAM చెప్పారు…
Thanq so much uma maheswari garu and molakanews..🙏🏻
అజ్ఞాత చెప్పారు…
సేవా భావం గణేష్ సార్ కవచకుండలం.ఆయన పట్టు వీడని విక్రమార్కుడు. ఎందరో పేదల జీవితాల్లో వెలుగు లు నింపిన అక్షర దివిటీ.మరో వైపు కలం అనే హలం పట్టి అక్రమార్కులు అనే చీడ పురుగుల భరతం పట్టి వ్యవసాయం చేస్తున్నారు
GANESH BONAM చెప్పారు…
మిత్రులందరికీ ధన్యవాదాలు..మీ వంటి ఎందరో మంచి మనసున్న స్నేహితులే నా సంకల్ప బలానికి బాసట..మీలో మానవత్వమే ఇలాంటి ఎందరో అభాగ్యులకు చేయూత..ఇదంతా స్పందించే హృదయమున్న మీ మీవంటి వారి గొప్పతనం..మీ అందరి అభిమానాన్ని పొందడం నా అదృష్టం..ముఖ్యంగా నా కోసం సమయం వెచ్చించి రాసిన ఉమా మహేశ్వరి గారికి, నా సేవలను గుర్తించి బ్లాగ్ లో టోటు కల్పించిన'మొలకన్యూస్'బృందానికి కృతజ్ఞతలు.🙏🏻